ఫ్లిఫ్‌కార్ట్ ఫోన్ పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే?
ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.250 వరకు రీచార్జ్‌లపై రూ.50 క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. ఆపై విలువ కలిగిన రీచార్జ్‌లపై రూ.7
ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.250 వరకు రీచార్జ్‌లపై రూ.50 క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. ఆపై విలువ కలిగిన రీచార్జ్‌లపై రూ.75 క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ఆఫర్లు అమల్లోకి రానున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా వినియోగదారులను కాపాడుకునేందుకు కొత్త కస్టమర్లను పొందే విషయంలో బీఎస్ఎన్ఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. గత నెలలో 50 శాతం అదనపు డేటాను ప్రమోషన్‌లో భాగంగా అందించిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం క్యాష్ బ్యాక్ పేరిట రీటైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.