Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jioకు పోటీ.. బీఎస్ఎన్ఎల్ పక్కా ప్లాన్.. స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో కామ్‌గా ఎందుకుందంటే?

రిలయన్స్ జియోకు పోటీగా టెలికామ్ ఆపరేటర్లు పోటాపోటీగా డేటా ప్లాన్‌లు ప్రకటిస్తున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం జియోకు చెక్ పెట్టేందుకు వెరైటీ ప్లాన్ చేస్తోంది. జియోను ఎదుర్కొనేందుకు బీఎస్ఎన్ఎల్ అన్ని

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:42 IST)
రిలయన్స్ జియోకు పోటీగా టెలికామ్ ఆపరేటర్లు పోటాపోటీగా డేటా ప్లాన్‌లు ప్రకటిస్తున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం జియోకు చెక్ పెట్టేందుకు వెరైటీ ప్లాన్ చేస్తోంది. జియోను ఎదుర్కొనేందుకు బీఎస్ఎన్ఎల్ అన్ని రకాల చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది.

ఇటీవల జరిగిన 2016 స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో భాగంగా ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ టెలికం సంస్థలు భారీ మొత్తంలో స్పెక్ట్రమ్ ఎయిర్‌వేవ్స్‌ను కొనుగోలు చేయగా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఈ వేలంలో చాలా సైలెంట్‌గా కనిపించింది. 
 
బీఎస్ఎన్ఎల్ స్పెక్ట్రమ్ వేలంలో అలా మౌనంగా ఉండేందుకు కారణం.. తన వద్ద ఉన్న ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్‌ను పూర్తిస్థాయిలోబలోపేతం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ఇందుకుగాను భారీ పెట్టుబడులతో తమ నెట్ వర్క్ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే దిశగా ముందుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.
 
ముందుగా మొబైల్ నెట్‌వర్క్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొత్త మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేయనుంది. మార్చిలోగా20వేల బీటీఎస్ టవర్స్ ఇన్‌స్టాల్ చేయబడతాయి. మార్చి 2018 నాటికి ఈ వై-ఫై హాట్‌స్పాట్‌ల సంఖ్యను 40,000కు పెంచాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.
 
ఈ హాట్‌స్పాట్స్ అన్నింటిని తమ మొబైల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. దీని వల్ల తమ కస్టమర్లు వాటి పరిధిలోకి వెళ్ళగానే డేటా సెషన్‌ వైఫై హాట్‌స్పాట్‌ కనెక్ట్‌ కావడం వల్ల నిరంతరాయంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటారని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments