Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ కావాలంటే.. పాస్ పోర్ట్ ఉండాల్సిందే..!

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (17:33 IST)
భారత్‌లో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ కావాలంటే.. చేతిలో పాస్ పోర్టు ఉండాల్సిందే. ఎందుకంటే ఈ ఫోన్ల విక్రయాలను పాస్ పోర్ట్ బుకింగ్స్ ద్వారా చేపట్టనున్నారు. దీంతో పాస్ పోర్ట్ ఉన్నవారు మాత్రమే ఈ ఫోన్లను బుక్ చేసుకునే వెసులుబాటు లభించింది. ఇలా బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ రెండో వారంలో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్లను చేతికి అందివ్వనున్నారు. అందుకే వీటికి బ్లాక్ బెర్రీ పాస్ పోర్ట్ అనే మరో పేరును కూడా పెట్టారు. 
 
అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్ల కంటే.. ఈ ఫోన్లు కాస్తంత వెరైటీగా ఉండనున్నాయి. ఇప్పటిదాకా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నవాటినే మనం చూస్తున్నాం. కానీ బ్లాక్ బెర్రీ తాజాగా విడుదల చేసిన ఈ పాస్ పోర్ట్.... చతురస్రం మాదిరిగా పొడవుతో పాటు వెడల్పు కూడా ఒకే కొలతలతో ఉంది. గత గురువారం పాస్ పోర్ట్‌ను విడుదల చేసినట్టు ప్రకటించిన కెనడా మొబైల్ తయారీ దిగ్గజం బ్లాక్ బెర్రీ, తాజాగా భారత మార్కెట్‌లోకి దానిని తీసుకొచ్చింది. 
 
ఈ స్మార్ట్ ఫోన్ బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ 'పాస్ పోర్ట్'లు అక్టోబర్ రెండో వారం నుంచి వినియోగదారుల చేతుల్లో ఇమిడిపోనున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బెర్రీ అంటే, అదో స్టేటస్ సింబల్‌గా పరిగణించే వారు. యాపిల్, శాంసంగ్‌ల రాకతో ఆ ప్రతిష్ట కాస్త తగ్గిపోయింది. అయితే, తిరిగి పునర్‌వైభవం సాధించే దిశగా సరికొత్త తరహాలో మార్కెట్‌లోకి దూసుకొచ్చేసింది. ఇంతకీ ఈ ఫోను ధర ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.49,990 మాత్రమే. 
 
బ్లాక్ బెర్రి పాస్‌పోర్ట్ 4.5 అంగుళాలు టచ్ స్క్రీన్, 3 రో కీ ప్యాడ్ కలిగివుంది. ఇందులో 3450 ఎంఏహెస్ నాన్ రిమూవబుల్ బ్యాటెరీ, 14 గంటల టాక్ టైమ్, 2జి నెట్‌వర్క్, 11 గంటల పాటు వీడియో ప్లే బ్లాక్ సౌకర్య కలిగివుంది. అలాగే, 13 మెగా పిక్సిల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సిల్ కెమెరాతో పాటు.. 32 జీబీ వరకు ఇంటెర్నల్ మెమెరీ సపోర్టు, 128 జీబీ వరకు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ సౌకర్య ఉంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments