Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్ గేట్స్ సంచలన నిర్ణయం.. యావత్ సంపదను సమాజానికే ఇస్తా!

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (18:12 IST)
ధనవంతులు విరాళాలు ప్రకటించడం ఒక ఎత్తు. మరికొందరు సంపన్నులు డబ్బును ఆదా చేయడంలోనూ దృష్టి సారిస్తారు. డబ్బు సంపాదించడం.. ఆస్తులను కూడబెట్టడం సంపన్నుల నైజం. వీరిలో చాలామంది తమ ఆస్తులను ఇతరుల ఇవ్వడానికి మొగ్గు చూపరు. కానీ ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ మాత్రం డిఫరెంట్.
 
సామాజిక సేవా కార్యక్రమాల కోసం తాజాగా 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.60 లక్షల కోట్లు) విరాళం ప్రకటించిన ఆయన.. తన జీవనానికి, తన కుటుంబ సభ్యుల జీవనానికి కావాల్సింది పోను, మిగిలిన తన యావత్ సంపదను కూడా సమాజానికే ఇచ్చేస్తానని బిల్ గేట్స్ ప్రకటించారు.
 
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 103 బిలియన్ డాలర్లు (రూ.8.13 లక్షల కోట్లు). తన మాజీ భార్య మిలిందాతో కలసి ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో (భారత్ కూడా) ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జీవనానికి అయ్యే ఖర్చుకు మిగులును సమాజానికే ఇచ్చేస్తానని తెలిపారు. ప్రస్తుతం ఏటా ఈ ఫౌండేషన్ తరఫున 6 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుండగా, 2026 నాటికి 9 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్నది ఆయన లక్ష్యమని తెలిపారు. 
 
"నేను ఇస్తున్న ఈ విరాళం త్యాగం కాదు. గొప్ప సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యం అవుతున్నానని గర్వంగా ఉంది. నా వనరులను సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రపంచంలో గొప్ప సంపద కలిగిన ఇతరులు సైతం ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను" అని బిల్ గేట్స్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments