Webdunia - Bharat's app for daily news and videos

Install App

Battlegrounds Mobile India రికార్డ్.. గూగుల్ ప్లేస్టోర్‌లో 3కోట్ల 40లక్షల యూజర్లు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:55 IST)
ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ గేమ్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ ఇండియాలో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆ గేమ్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా, ఏడాది తర్వాత బ్యాటిల్​గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ (BGMI) పేరుతో భారత్‌లో మళ్లీ లాంచ్ అయింది. కొన్ని మార్పులు చేర్పులతో ప్రత్యేకంగా 'ఇండియా వెర్షన్'తో మార్కెట్లోకి వచ్చిన ఈ గేమ్ అనుకున్నట్లుగానే కొత్త రికార్డులు బ్రేక్ చేసింది.
 
బ్యాటిల్​గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ఎట్టకేలకు జూలై 2వ తేదీన ఇండియాలో అధికారికంగా లాంచ్ అయింది. కాగా గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదల చేసిన వారంలోనే 3కోట్ల 40 లక్షల మంది రిజిస్టర్ యూజర్లు వచ్చారని గేమ్ డెవలపర్​క్రాఫ్టాన్ ​ప్రకటించింది. 
 
అంతేకాదు ప్రతిరోజు 16 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉండగా, 2.4 మిలియన్ కాంకరెంట్ ప్లేయర్స్ ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌కు మాత్రమే పరిమితమైన ఈ గేమ్, అక్కడ టాప్ ఫ్రీ గేమ్స్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అనుకున్నట్లుగానే గ్రాండ్ హిట్ కొట్టడంతో, మరిన్ని ఎంటర్‌టైనింగ్ కంటెంట్స్ తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 
 
మేజర్ అప్‌డేట్ త్వరలో వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఐవోఎస్‌లో ఎప్పుడు విడుదలయ్యేది ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. ఇక బ్యాన్‌కు ముందు 50 మిలియన్ డౌన్‌లోడ్స్‌తో, 33 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments