Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలానికి ప్రపంచంలోనే అతి భయంకరమైన ల్యాప్‌టాప్...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (19:31 IST)
చారిత్రక ప్రాశస్త్యం కలిగిన, అరుదైన, అపురూపమైన వస్తువులు, పాతకాలం నాటి కళాఖండాలను వేలం వేయడం చాలానే చూసుంటాం. కానీ వీటన్నింటికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌గా పేరొందిన ఓ వస్తువు వేలానికి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, కంపెనీలకు 95 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరువచ్చింది. నిర్వాహకులు దీన్ని వేలం వేయగా 1.3 మిలియన్‌ డాలర్లు పలికింది.
 
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నాక్రై’, ‘ఐ లవ్‌ యూ’, ‘డార్క్‌ ఎనర్జీ’, ‘సో బిగ్‌’, ‘మైడూమ్‌’, ‘డార్క్‌టెక్విలా’ వైరస్‌లు, రాన్సమ్‌వేర్‌లు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను గ్యూ ఓ డాంగ్‌ అనే ఇంటర్నెట్‌ ఆర్టిస్ట్‌ రూపొందించాడు. 
 
వైరస్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇలాంటివి భౌతికంగా మనపై దాడి చేస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని దీన్ని కేవలం విద్యా ప్రయోజనాల కోసమే వినియోగించాలని నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments