Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ యాప్ స్టోర్ ధరలు భారీగా పెరిగిందట.. భారత్-యూకే-టర్కీల్లో?

స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ తన యాప్ స్టోర్ ధరలను భారీగా పెంచింది. భారత్‌తో పాటు యూకే, టర్కీలోని యాప్ స్టోర్‌లో రుసుంను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే దీనికి సంబంధించిన ఔఓఎస్ యాప్ డెవలపర్లకు

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (12:15 IST)
స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ తన యాప్ స్టోర్ ధరలను భారీగా పెంచింది. భారత్‌తో పాటు యూకే, టర్కీలోని యాప్ స్టోర్‌లో రుసుంను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే దీనికి సంబంధించిన ఔఓఎస్ యాప్ డెవలపర్లకు ఈ-మెయిల్స్ పంపింది. భారత్‌.. టర్కీ యాప్‌ స్టోర్లలోనూ ధరలు పెంచింది. భారత్‌లో సేవా పన్నులు పెరగడంతో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టర్కీ కరెన్సీ 'లిరా' విలువ కూడా భారీగా కుదేలవడంతో టర్కీలోనూ యాప్‌ స్టోర్‌ ధరలు పెంచింది. 
 
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు జరిగిన బ్రెగ్జిట్ రెఫరెండం ఎన్నికల ప్రభావంతో బ్రిటిష్‌ పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చితే పౌండ్‌ దాదాపు 18.5 శాతం నష్టపోయింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు యాప్‌ స్టోర్‌ టారిఫ్‌లు పెంచుతున్నట్లు యాపిల్‌ తెలిపింది. ఇప్పటి వరకూ 0.79 పౌండ్‌ ఉంటే ఇకనుంచి 0.99 పౌండ్‌ చెల్లించాల్సి ఉంటుందట. అంటే దాదాపు 25శాతం పెరిగింది. పెంచిన ధరలు ఏడు రోజుల్లో అమల్లోకి వస్తాయని యాపిల్‌ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments