Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అమేజాన్ వెబ్ సర్వీసెస్.. భారీగా ఉద్యోగవకాశాలు

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (13:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమేజాన్ సంస్థ ముందుకొచ్చింది. 20,761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్ట అమేజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. అలాగే తన అమేజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అమేజాన్ మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. 
 
ప్రతి అవైలబిలిటీ జోన్‌లో కూడా అనేక డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. 2022 సంవత్సర ప్రథామార్థంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు అమేజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. తెలంగాణలో అమేజాన్ భారీ పెట్టుబడి పెట్టడాన్ని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని అన్నారు. అమేజాన్ సంస్థ ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
 
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అమేజాన్ వెబ్ సర్వీసెస్ తనను దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments