Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో భారీగా పెట్టుబడి పెట్టనున్న అమేజాన్.. చెన్నైలో ఎలక్ట్రానిక్ సంస్థ

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:32 IST)
భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం అమేజాన్ సిద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. అమేజాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అమెజాన్ చెన్నైలో ఎలక్ట్రానిక్ తయారీ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్స్ లాంటి పరికరాలను అమెజాన్ తయారు చేయనుంది. గ్లోబల్ కంపెనీ అయిన అమెజాన్.. పూర్తి స్థాయిలో ఓ ఇండియన్ కంపెనీ తరహాలో అభివృద్ధి చెందాలి' అని మంత్రి ఆకాంక్షించారు. 
 
ఇదిలా ఉంటే.. అమెజాన్ ఈ ఏడాది నుంచే టీవీ స్ట్రీమింగ్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే.. తైవానీస్ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఫాక్స్‌కాన్‌కు చెందిన క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీ సంస్థ ఫైర్ టీవీ స్టిక్‌లను తయారు చేస్తోంది. భారత్‌కు చెందిన వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా వేల సంఖ్యలో ప్రతీ ఏడాది ఫైర్ టీవీ స్టిక్స్‌ను తయారు చేసేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments