Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు అమితాసక్తితో ఉన్నా : జఫ్ బెజోస్

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:09 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు తాను అమితాసక్తితో ఉన్నట్టు ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. కామ్ అధినేత జెఫ్ బెజోస్ తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బెజోస్, ఇక్కడి మార్కెట్ తీరుతెన్నులు, పండగ వాతావరణానికి మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్‌పై పొగడ్తలు గుప్పించిన ఆయన అవకాశం ఉంటే, భారత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై ఆయన స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మోడీ, అందరికంటే ముందున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించిన ఆయన.. మోడీతో భేటీపై అమితాసక్తితో ఉన్నానన్నారు. 
 
ఇదిలావుంటే, భారత్‌లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు బెజోస్ సూత్రప్రాయ ప్రకటన జారీ చేశారు. ఇటీవలే మైక్రోసాఫ్ట్, తన డేటా సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ కూడా తన డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనతో భారత మార్కెట్‌ను మరింతమేర ఒడిసిపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments