Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోమాక్స్ 20 శాతం వాటాల కొనుగోలుపై ఆలీబాబా దృష్టి!

Webdunia
శుక్రవారం, 8 మే 2015 (15:51 IST)
మొబైల్ దిగ్గజం మైక్రోమాక్స్‌లో 20 శాతం వాటాలను కొనుగోలు చేయాలని చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఈ-కామర్స్ జెయింట్ ఆలీబాబా భావిస్తోంది. ఇండియాలో శాస్త్రసాంకేతికత శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో సాధ్యమైనంత ఎక్కువ భాగస్వామ్యాన్ని పొందాలని భావిస్తున్న ఆలీబాబా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ మార్కెట్ విలువ ప్రకారం 20 శాతం వాటా నిమిత్తం 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,200 కోట్లు) ఆలీబాబా చెల్లించాల్సి వుంటుంది. అమ్మకాల పరంగా ఇండియాలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా ఉన్న మైక్రోమ్యాక్స్ విలువ 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38 వేల కోట్లు) వరకూ ఉంటుందని అంచనా. 
 
సంస్థకు విలువ కట్టడంలో నిమగ్నమైన అధికారులు, అది పూర్తికాగానే ఏ మేరకు వాటాలు ఆలీబాబాకు అమ్మాలన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. అలీబాబాలో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఉన్న సాఫ్ట్ బ్యాంక్, ఈ విషయంలో కాస్తంత గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments