Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ నుంచి ఎక్స్‌‍ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ వైర్‌లెస్ సర్వీస్

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (14:21 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్‌.. ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ పేరిట ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ సర్వీసులను ప్రారంభించింది. తొలుత ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని నగరాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అందించేందుకు ఈ ఎయిర్‌ ఫైబర్‌ సేవలు ఉపయోగపడతాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
'దేశంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అడ్డంకులున్నాయి. ఎయిర్‌ఫైబర్‌ ఆ లోటును పూడ్చనుంది. ప్రతి ఇంటికి వైఫై సర్వీసుల అందించేందుకు దీంతో వీలు పడుతుంది. తొలుత ఢిల్లీ, ముంబై నగరాల్లో దీన్ని ప్రారంభిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం' అని ఎయిర్‌ కన్జూమర్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ సారస్వత్‌ శర్మ తెలిపారు. మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ కింద ఎయిర్‌ ఫైబర్‌ డివైజులను తయారుచేసినట్లు పేర్కొన్నారు.
 
ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ అనేది ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌. వైఫై 6 టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. గరిష్టంగా దీనికి 64 డివైజులను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఫైబర్‌ డివైజ్‌ కొనుగోలు చేశాక ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డివైజ్‌ మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. 
 
ఎయిర్‌ ఫైబర్‌ నెలవారీ ప్లాన్‌ రూ.799గా ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుతాయి. ఆరు నెలలకు కలిపి ఒకేసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద మరో రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా డిస్కౌంట్‌ పోగా రూ.7,733 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సింగిల్‌ ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments