Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌‍టెల్ కస్టమర్లకు షాక్.. మూడేళ్లలో 2జీ, 3జీ కట్.. కేవలం 4జీ సేవలే..

రిలయన్స్ జియో ఎఫెక్టుతో 4జీ క్రేజ్ అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత టెలికాం రంగాలన్నీ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న వేళ.. భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ 2జీ, 3 సేవలకు మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది.

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (17:31 IST)
రిలయన్స్ జియో ఎఫెక్టుతో 4జీ క్రేజ్ అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత టెలికాం రంగాలన్నీ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న వేళ.. భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ 2జీ, 3 సేవలకు మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది.

మరో మూడు, నాలుగేళ్లలోపు 2జీ, 3జీ సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి స్థానంలో స్పెక్ట్రమ్‌లను 4జీ సర్వీసులను జతచేస్తామని ఎయిర్‍‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఇప్పటికే 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని ప్రకటించింది. తమ నెట్‌వర్క్‌లో డేటా సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయడం కోసం 4జీ టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం 2100 మెగా హెర్ట్జ్ బ్యాండ్ లను వాడుతున్నామని... తమ స్పెక్ట్రమ్‌లో ఎక్కువ భాగాన్ని 4జీ సర్వీసులకే కేటాయిస్తున్నామని తెలిపారు. కొన్ని టెలికాం సర్కిళ్లలో అత్యాధునిక 3జీ పరికరాలను అమరుస్తున్నామని.. వాటికి 4జీ సపోర్ట్ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో 3జీ సేవలను వాడుతున్నవారు.. ఇక వాటిని పక్కనబెట్టి 4జీ కెపాసిటీ గల స్మార్ట్ ఫోన్లను కొనాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments