Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్‌ ఆఫర్... రోజుకు 3జీబీ డేటా

దేశీయ టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కం

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (08:46 IST)
దేశీయ టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మ‌రో ఆఫర్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టిన ఎయిర్‌టెల్.. త‌మ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం రూ.799తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న‌ట్లు పేర్కొంది. 
 
జియో కూడా ఇటీవ‌ల ఇటువంటి ఆఫ‌రే తీసుకురావ‌డంతో పోటీని త‌ట్టుకోవడానికి ఎయిర్‌టెల్ కూడా ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఉచిత మంత్రాన్ని జపిస్తూ టెలికాం మార్కెట్లోకి వ‌చ్చిన‌ రిల‌య‌న్స్ జియో అదే జోరును కొన‌సాగిస్తుండ‌టంతో టెలికాం కంపెనీల మ‌ధ్య విప‌రీతంగా పోటీ నెల‌కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments