దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది.
వచ్చే జనవరిలో మరోసారి జియో టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొనట్టు అమెరికాకు చెందిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాచె వెల్లడించింది. దీంతోపాటే ప్రస్తుతం 49 రోజులున్న రూ.309 ప్యాకేజీ గడువును జియో వచ్చే జనవరి నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉంది.
ఈ మార్పులతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే ఈ కంపెనీలకు సగటున ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే ఆదాయం (ఎఆర్‌పియు) కూడా పెరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాచె వెల్లడించింది.