Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో వెన్ను విరిచిన ట్రాయ్.. ఊపిరి పీల్చుకున్న వొడాఫోన్, ఎయిర్‌టెల్

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (11:36 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. ఆపై బంపర్ ఆఫర్లతో వినియోగదారుల సంఖ్యను అమాంతం పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో టెలికాం రంగ సంస్థల భారీ నష్టాలను దృష్టిలో పెట్టుకుని, జియో వెన్ను విరిచింది. ఇందులో భాగంగా మొబైల్ రింగింగ్ టైమ్ 30 సెకన్లు మాత్రమే వుండాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇప్పటివరకు అన్నీ నెట్‌వర్క్ సంస్థలన్నీ అవుట్ గోయింగ్ కాల్స్‌కు రింగింగ్ సమయాన్ని 45 సెకన్లను వుంచాయి. అయితే ఇటీవల రిలయన్స్ జియో సంస్థ తన రింగింగ్ కాల్స్ సమయాన్ని ఉన్నట్టుండి 20 సెకన్లకు తగ్గించింది. దీన్ని ఎయిర్ టెల్ తీవ్రంగా ఖండించింది. 
 
అంతేగాకుండా ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది. ఫలితంగా ట్రాయ్ జియోకు షాక్ ఇచ్చింది. ఫలితంగా జియో రింగింగ్ టైమ్‌ను 20 సెకన్ల నుంచి 25 సెకన్లకు పెంచింది. ఈ క్రమంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి టెలికాం సంస్థలు కూడా తమ రింగింగ్ సమయాన్ని తగ్గించాయి. 
 
ఈ నేపథ్యంలో ల్యాండ్ లైన్, సెల్ ఫోన్ సేవలకు సంబంధించి సవరణలపై ట్రాయ్ కన్నేసింది. ఇందులో భాగంగా సెల్ ఫోన్ల రింగింగ్ టైమ్ 30 సెకన్లకు, ల్యాండ్ లైన్లకు 60 సెకన్ల రింగింగ్ టైమ్ వుండాలని షరతు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments