Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిందే.. మార్చి 2021 వరకు గడువు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (17:33 IST)
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోలేదంటే.. ఇబ్బందులు తప్పవు. ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. పాన్ కార్డును ఉపయోగించడం కుదరదు. ఇప్పటిదాకా 32.71 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో అనుసంధానమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
 
మోదీ సర్కార్ పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగిస్తూ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా పాన్ ఆధార్ అనుసంధానానికి గడువు మార్చి 2021 వరకు ఉంది. జూన్ 29 నాటికి దేశంలో జారీ అయిన పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉంది. 
 
నిర్దేశిత గడువులోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డులు పని చేయవని, చెల్లుబాటు కావని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇంకా ఇప్పటికీ 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ కావాల్సి ఉంది. 
 
ఇంకా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ఇంకా 7 నెలల గడువు ఉంది. ఎక్కువ గడువు ఉందని అలాగే ఉండిపోవద్దు. వెంటనే రెండింటినీ లింక్ చేసుకోండి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చు. క్షణాల్లో పని పూర్తి చేసుకోవచ్చునని ఐటీ నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments