Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ మాసం విశిష్టత : ఇస్లాం పదానికి అర్థం ఏమిటి?

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (17:15 IST)
ఇస్లాం మతాన్ని అవలంబించేవారికి, ఆధ్యాత్మిక, సామాజిక వ్యక్తిగత, న్యాయ ధర్మ, శిక్ష వంటి అంశాలన్నింటికీ పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంథమే ఆధారం. ఇస్లాం అనే పదానికి పూర్తి వినయ విధేయతలతో సకల చరాచర సృష్టికర్త, సర్వేశ్వరుడైన అల్లాకు లోబడి ఉండటం అని అర్థం. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడే అపార కరుణామయుడు. 
 
ఎవరి అదుపు ఆజ్ఞలో సకల చరాచర లోకవ్యవస్థ ఆగమిస్తుందో అలాంటి పరమపవిత్రమైన పరమేశ్వరుడైన అల్లాహ్‌కి లోబడి పవిత్ర ఖురాన్ నిర్దేశిత జీవన విధానాన్ని గడపడం ఇస్లాం మతం అవలంభించేవారి విధి. అయితే ఇస్లాంను పరిపూర్ణంగా అమలు చేసేందుకు ముస్లింలు ఐదు ముఖ్యమైన అంశాలను పాటించాల్సి ఉంటుంది. అవి
 
1. ఈమాన్ ( దైవత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం)
2. నమాజ్ (8 సంవత్సరాలు దాటిన బాలబాలికలతో విధిగా 5 సార్లు పాటించవలసింది) 
3. రోజా (ఉపవాస దీక్ష) 8 సంవత్సరాలు దాటిని బాలబాలికలతోపాటు అందరూ విధిగా పాటించాల్సింది. 
4. జకాత్ / సద్కా (దాన ధర్మాలు) తమ స్థిర, చరాస్తులు, ఆదాయం, సంపదను బట్టి నిర్దేశించిన స్థాయిలో దానధర్మాలు చేయడం
5. హజ్‌యాత్ర : సౌదీ అరేబియా మక్కాలో నెలకొని ఉన్నా పరమపవిత్ర దైవగృహం అనబడే కాబా క్షేత్రాన్ని నిర్దేశిత నియమ నిబంధనలు పాటిస్తూ దర్శించి పునీతులు కావడమే హజ్ యాత్ర ఆంతర్యం. ఆర్థిక పుష్టి కలిగి, కుటుంబ బరువు బాధ్యతల నుంచి, అన్ని రకాల రుణాల నుంచి విముక్తమైనవారు తమ జీవితకాలంలో ఒకసారైనా హజ్‌యాత్ర చేయగలగాలి. 
 
అయితే హజ్ యాత్ర తప్ప మిగతా నాలుగు అంశాలు ఆర్థిక స్థోమతలో వ్యత్యాసాలున్నప్పటికీ, ప్రతి ముస్లిం స్త్రీ, పురుషులు పాటించాల్సిందే. ఐదు అంశాల్లో ఒకటైన రోజా (ఉపవాస దీక్ష) రంజాన్ మాసంలో అత్యంత భక్తిక్షిశద్ధలతో పాటించే దీక్ష. ఈ నెలలో ముస్లిం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. రంజాన్ మాసం గురించి దివ్య ఖురాన్ 2-185 అధ్యాయంలో ఇలా వివరించడం జరిగింది.
 
‘‘పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన మాసం రంజాన్. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజు మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుంచి రంజాన్ మాసాన్ని పొందే వ్యక్తి ఆ మాసం అంతా విధిగా ఉపవాస దీక్ష పాటించాలి.  
 
మహోన్నత పరమ పవిత్రమైన దివ్య ఖురాన్‌ను అవతరింపజేసినందుకు, మహమ్మద్‌ను ప్రవక్తగా నియమించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతను తెలియజేయడానికి ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారు. రంజాన్ మాసంలో జకాత్ - సద్కా (దానధర్మాలు) ఎక్కువగా జరుగుతాయి. రంజాన్ సహనమాసం. సహనానికి ప్రతిఫలం స్వర్గం. పరస్పరంగా సానుభూతి కనబర్చాల్సిన మాసం. కోపతాపాలకు దూరంగా, శాంతంగా, దయాభావంతో ఉండాల్సిన కాలం. మరి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

Show comments