Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంజాన్' పండుగను శనివారమే జరుపుకోవాలి: ముస్లిం పెద్దలు

Webdunia
FILE
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మదీయులు జరుపుకునే పండుగ రంజాన్ లేదా రమదాన్. ఆద్యంతం సేవా తత్పరతను ప్రబోధించే ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన మసీదులలో చేస్తారు.

అనంతరం ఒకరికొకరు 'ఈద్‌ముబారక్ ' (శుభాకాంక్షలు) తెలుపుకుంటారు. ఈ నమాజ్ కోసము వెళ్లే ముస్లిం సోదరులు ఒక దారిన వచ్చి మరో దారిన వెళ్తారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.

ఇంకా రంజాన్ మాసంలో జరిగే ' ఇఫ్తార్ విందు'ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రస్ఫుటమవుతాయి. పరస్పర ధోరణికి , విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం. ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది.

తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే.

కాగా.. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని శనివారమే జరుపుకోవాలని జామా మసీదు సాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రకటించారు. గురువారం ఏ ప్రాంతంలోనూ చంద్రుడు కనిపించలేదని బుఖారీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో శనివారమే రంజాన్ నిర్వహిస్తున్నట్లు ఫతేపురి మసీదు సాహి ఇమామ్ ముఫ్తీ మహమ్మద్ ముకరం అహ్మద్ కూడా తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

TTD Temple: హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Show comments