Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బక్రీద్" పండుగను ఎందుకు జరుపుకుంటారంటే..?

Webdunia
FILE
" ఈదుల్ జుహా" అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ. ఈ పండుగనే ’బక్రీద్’ అంటారు. బక్రీద్ అనే పేరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారనేందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరుతాడు.

నిద్ర నుంచి మేల్కొన్న ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌కు ఈ సంగతి తెలియజేయడంతో, దైవ భక్తుడైన ఇస్మాయిల్ తాను బలవడానికి సిద్ధమేనని చెబుతాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ముస్లిం సోదరులు బక్రీద్ (బక్రా అనగా గొర్రె) పండుగను జరుపుకుంటున్నారు.

బక్రీద్ పండుగను పురస్కరించుకుని పండుగకు ముందురోజున మరణించిన వారి గోరీల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా ఉంచితే వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని విశ్వసిస్తారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ.

మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. మరి ముస్లిం సోదరులందరికీ "ఈద్ ముబారక్" అంటూ మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దామా..!.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

Show comments