Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాలను రూపుమాపే రంజాన్ దానధర్మాలు

Webdunia
ముస్లిం మతస్థులకు అత్యంత ముఖ్యమైనది రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ముస్లింలు నెలపాటు నియమాలతో కూడిన కఠినమైన ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ నెలలో వారు అధికంగా దానధర్మాలు చేస్తారు.

రంజాన్ మాసంలో చేసే దానాలకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ దానాల్లో రెండు రకాలున్నాయి. జకాత్, ఫిత్రా. జకాత్ అంటే ముస్లిం మతస్థులు తమ సాంవత్సరిక ఆదాయం, ధనంలో 2.5 శాతం డబ్బు అవసరమున్న, పేదవారికి సాయం చేయాలి. ఈ జకాత్‌ను రంజాన్ నెలలో లెక్కగట్టి చెల్లిస్తారు.
ఫిత్రా దానధర్మాలు
  ఫిత్రా ధార్మిక విధానం కింద అభాగ్యులకు, పేదవారికి దానం చేస్తారు. తిండి, బట్టలకు నోచుకోని వారికి వీరు సాయం చేస్తారు. దేవుడు తమకిచ్చిన జీవితం, సుఖసంతోషాలకు కృతజ్ఞతగా ముస్లిం సోదరులు లేనివారికి ఈ దానం చేస్తారు.      


రెండోది ఫిత్రా. ఫిత్రా ధార్మిక విధానం కింద అభాగ్యులకు, పేదవారికి దానం చేస్తారు. తిండి, బట్టలకు నోచుకోని వారికి వీరు సాయం చేస్తారు. దేవుడు తమకిచ్చిన జీవితం, సుఖసంతోషాలకు కృతజ్ఞతగా ముస్లిం సోదరులు లేనివారికి ఈ దానం చేస్తారు. ఈ ఫిత్రాదానంలో గోధుమలు కానీ, ఆహారధాన్యములు కానీ, ధనాన్ని కానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబ సభ్యుల తరఫున ఇంటిపెద్ద చేస్తారు.

ఈ దానాల ద్వారా బంధాల నుంచి విముక్తి చెంది అల్లాను చేరుకుంటామని ఇస్లాం మతస్థుల విశ్వాసం. జీవితంలో చేసిన చెడు తలంపులు, పలికిన అసత్యాలు, చేసిన పాపాలు రంజాన్ నెల దానధర్మాల ద్వారా నశించిపోతాయని వారు చెబుతుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

Show comments