Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని ఏమార్చిన యాంకర్ జీన్స్.. ఆన్‌లైన్‌లో సెటైర్ల మీద సెటైర్లు

కెరీర్‌లో ఎలాంటి తప్పూ చేయని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి మీడియా కన్నుకు దొరికిపోయాడా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ ప్రాక్టీసులో నిమగ్నమైన కోహ్లీ తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మహిళా యాంకర్‌ ధరించిన చింపిరి జీన్స్ కేసి ఆలానే చూ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (03:25 IST)
కెరీర్‌లో ఎలాంటి తప్పూ చేయని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి మీడియా కన్నుకు దొరికిపోయాడా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ ప్రాక్టీసులో నిమగ్నమైన కోహ్లీ తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మహిళా యాంకర్‌ ధరించిన చింపిరి జీన్స్ కేసి ఆలానే చూస్తూండిపోయిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఫ్యాషన్ పట్ల కోహ్లీ మక్కువగా ఆ ఘటనకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు రెండడుగులు ముందుకు వేసి ఇకపై కోహ్లీని ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలంటే అతడి ప్రేయసి అనుష్క శర్మ పర్మిషన్ తీసుకోవలసిందే అంటూ మేలమాడారు. ఈ విషయమై కోహ్లీ నుంచి వివరణ లేదు కానీ లేడీ యాంకర్ జీన్స్ కేసి తదేకంగా అతడు చూస్తున్న చూపు మాత్రం కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయి హల్ చల్ సృష్టిస్తోంది.
 
వివరాల్లోకి వస్తే.. ఐపీఎల్ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో అర్చన విజయ అనే టీవీ వ్యాఖ్యాత కోహ్లీని ఇంటర్వ్యూ చేయడానికి అతను ప్రాక్టిస్ చేస్తున్నచోటుకు వెళ్లింది. ఆమె కెమెరావైపు చూసి మాట్లాడుతుంటే కోహ్లీ చూపు మాత్రం ఆమె జీన్స్‌పైకి మళ్లాయి. అలా తదేకంగా చూస్తుండిపోయాడు. ఇంతకంటే ఫ్యాషన్‌ ఉండదన్నట్లు ఆ జీన్స్ చూశారుగా ఎలా ఉందో! వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్ల స్పందనా అధికంగానే ఉంది. 
 
కోహ్లీ తన వృత్తిలో భాగంగా చాలామందికి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు, ఎప్పుడూ ఇలాంటిది లేదని కొందరు, అతనికి ఫ్యాషన్ మక్కువ కాబట్టి చూసి ఉంటాడని ఇంకొందరు సమర్థించారు. ఇక అతను ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ప్రేయసి అనుష్క శర్మ పర్మిషన్ కావాలని సైటైర్లూ వచ్చాయి. ఎదురుగా కెమెరా ఉన్న ఇంటర్వ్యూ కార్యక్రమంలో కళ్లు దారి మళ్లితే ఎవరికైనా సరే చిక్కులు తప్పవు మరి. టీమిండియా కెప్టెన్ కోహ్లీకి ఇంటర్వ్యూలు కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం అతని చూపులెక్కడో చిక్కుకుపోయాయి. అదీ విషయం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలు చేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

తర్వాతి కథనం
Show comments