Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీస్కోరును అవలీలగా ఛేదించిన రైజింగ్ పుణె: స్మిత్, రహానే వీరవిహారం

పరుగుల వరద పారిస్తున్న ఐపీఎల్ 10 సీజన్‌లో ధనాధన్ బ్యాటింగ్ ముందు బౌలర్లు తేలిపోతున్నారు. నిన్న హైదరాబాద్‌లో నేడు పుణెలో రెండోసారి బ్యాటింగ్ చేపట్టిన జట్టు ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేసిన క్రమంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. స్టీవ్‌ స్మిత్‌ సారథ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (02:46 IST)
పరుగుల వరద పారిస్తున్న ఐపీఎల్ 10 సీజన్‌లో ధనాధన్ బ్యాటింగ్ ముందు బౌలర్లు తేలిపోతున్నారు. నిన్న హైదరాబాద్‌లో నేడు పుణెలో రెండోసారి బ్యాటింగ్ చేపట్టిన జట్టు ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేసిన క్రమంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ జట్టు తొలిబోణీ కొట్టింది. స్మిత్, అజింక్యా రహానే స్ఫూర్తదాయక ఇన్నింగ్స్ ఫలితంగా ఒక బంతి మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్ విధించిన 185 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తం మీద 7 వికెట్ల తేడాతో ముంబై వంటి పటిష్ట జట్టుపై అవలీలగా విజయం పొందింది.
గెలవాలంటే 20 ఓవర్లలో 185 పరుగులు చేయాల్సిన సమయంలో పుణె జట్టు ఓపెనర్ అజింక్యా రహానే 60 పరుగులతో స్టీవ్ స్మిత్ 84 పరుగులతో అర్థశతకాలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ వికెట్ల ముందు పాతుకుపోయిన స్మిత్ సహచర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ చక్కటి భాగస్వామ్యాలను నెలకొల్పాడు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా తొలి మూడు బంతులకు ఒక్కొక్క పరుగే రావడంతో సస్పెస్స్ తారాస్థాయికి చేరుకుంది. అప్పుడే కెప్టెన్ స్మిత్ నాలుగు, ఐదు బంతులను భారీ సిక్సర్లుగా బాది పుణేను గెలిపించాడు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments