Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగూలీ డ్రీమ్ ఐపీఎల్ జట్టు.. మహేంద్ర సింగ్ ధోనీకి నో ప్లేస్.. ఓపెనర్లుగా కోహ్లీ, గంభీర్

ట్వంటీ-20 ఫార్మాట్‌కు ధోనీ ఏమాత్రం పనికిరాడని చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అదే మాటను నిజం చేశాడు. తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఈ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి గంగూ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (16:06 IST)
ట్వంటీ-20 ఫార్మాట్‌కు ధోనీ ఏమాత్రం పనికిరాడని చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అదే మాటను నిజం చేశాడు. తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఈ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి గంగూలీ చోటు కల్పించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‍కు గంగూలీ స్థానం కల్పించాడు. 
 
ఇంకా గంగూలీ డ్రీమ్ జట్టులో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఏబీ డివిలియర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి సునీల్ నరేన్, ఢిల్లీ జట్టు నుంచి క్రిస్ మోరిస్‌లకు చోటు కల్పించాడు. ఓపెనర్లుగా కెప్టెన్లు విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్‌లను బెంగాల్ దాదా ఎంచుకున్నారు.
 
దీనిపై గంగూలీ స్పందిస్తూ.. తన డ్రీమ్ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించినట్లు తెలిపాడు. ఎంతగానో ఆలోచించి.. కీలక మార్పుల ద్వారా ఐపీఎల్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటిస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఇక గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్ జట్టులో... విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, డివిలియర్స్, స్టీవ్ స్మిత్, నితీష్ రానా, మనీష్ పాండే, రిషబ్ పంత్, సునీల్ నరైన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం లభించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments