Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలం పాటలు : కడప కుర్రోడికి లక్కీ ఛాన్స్...

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (13:39 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ గురువారం ఆటగాళ్ళ వేలం పాటలు జరిగాయి. ఈ పాటల్లో ఏపీలోని కడప జిల్లా కుర్రోడికి లక్కాఛాన్స్ వరించింది. జిల్లాలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామసమీపంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెట్‌ క్రీడాకారుడు హరిశంకరరెడ్డిని చెన్నైలో గురువారం నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 
 
డిగ్రీ వరకు చదువుకున్న ఈ కుర్రోడు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా, అండర్‌-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. అనంతరం రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. 
 
హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments