Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు.. తొలిసారిగా స్పైడర్ కెమెరా నీడలో..!?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (11:00 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఆడే మూడు మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో విశాఖ ప్రత్యామ్నాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. 
 
దీంతో ముంబై ఇండియన్స్‌, పుణె సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీలు విశాఖలో మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి చూపాయి. కాగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోనే మ్యాచ్‌లు ఆడేందుకు పుణే ఆసక్తి చూపడంతో.. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) కూడా అత్యవసర సమావేశం నిర్వహించి మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ మూడు మ్యాచ్‌లకు స్పైడర్‌ కెమెరాను వినియోగించనున్నారు. 
 
విశాఖలో ఇటువంటి కెమెరాను వినియోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ధోనీ నాయకత్వంలోని పుణె జట్టు మే 10న సన్‌రైజర్స్‌, 17న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, 21న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో ఆడే మూడు మ్యాచ్‌లకు విశాఖ స్టేడియం వేదిక కానుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments