Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండకేసి బాది కూడా మళ్లీ పొగుడుతున్నారే.. పాపం ధోనీ..

టీమిండియా కూడా చేయలేని పని ఆ కొత్త ఐపీఎల్ ఫ్రాంచేజీ సంజీవ్ గోయెంకా చేశాడు. ఉరుము మెరుపు లేకుండానే వర్షం దంచికొట్టినట్లుగా భారత క్రికెట్ జట్టుకు అప్రతిహత విజయాలు అందించిన ఎంఎస్ ధోనీని చెప్పా పెట్టకుండానే ఐపీఎల్ పుణె జట్టు బాధ్యతల నుంచి తప్పించారు. అయి

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (02:56 IST)
టీమిండియా కూడా చేయలేని పని ఆ కొత్త ఐపీఎల్ ఫ్రాంచేజీ సంజీవ్ గోయెంకా చేశాడు. ఉరుము మెరుపు లేకుండానే వర్షం దంచికొట్టినట్లుగా భారత క్రికెట్ జట్టుకు అప్రతిహత విజయాలు అందించిన ఎంఎస్ ధోనీని చెప్పా పెట్టకుండానే ఐపీఎల్ పుణె జట్టు బాధ్యతల నుంచి తప్పించారు. అయినా సరే ధోనీ అంటే తనకు ఆపార గౌరవం అంటున్నాడు సంజీవ్. ధోనీ స్థానంలో వచ్చిన పుణె జట్టు కెప్టెన్ స్మిత్‌తో ధోనీ ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉంటున్నారని కూడా తెలిపారు.
 
తాను కలుసుకున్న అతి కొద్దిమంది మెరికల్లాంటి వ్యక్తుల్లో ధోనీ ఒకడని సంజయ్ గోయెంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ పదో సీజన్ మొదలు కానున్న సందర్భంగా గురువారం పుణె జట్టు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సందేహాలను నివృత్తి చేస్తూ ఏప్రిల్ 3 నుంచి ధోనీ తమతోనే ఉంటాడని వెనకేసుకొచ్చారు. ఒక లీడర్‌గా, ఆటగాడిగా, వ్యక్తిగా ధోనీపై తనకు అపారమైన గౌరవముంది, అతనికి నేను పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు.
 
మరోవైపు ఐపీఎల్ పుణే జట్టు కెప్టెన్‌గా ధోనీని తప్పించినప్పటికీ తనకు పూర్తిగా సహకరిస్తున్నాడని, మద్దతుగా ఉంటున్నాడని కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ పొగడ్తలు కురిపించాడు. తాను కెప్టెన్‌ అయినప్పటికీ ధోనీతో, ఇతర జట్టు ఆటగాళ్లతో తన క్రీడా సంబంధాలు ఏమీ మారవని స్మిత్ చెప్పాడు. పైగా తామిద్దరం ఇప్పటికే కొన్ని మెసేజ్‌లు పంపించుకున్నామని కూడా స్మిత్ చెప్పాడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments