Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ప్రాంచైజీల గూబ గుయ్‌మనిపించిన ఆ భీకర బౌలర్: కసి అంటే అదీ..

ఒక అసాధారణ బౌలర్‌ను ఎంతగా అవమానించాలో అంతగా అవమానించాయి ఐపీఎల్ ఫ్రాంచైజి యాజమాన్యాలు. అప్పటికే వన్డేలు, టీ 20ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఆ అత్యుత్తమ స్పిన్నర్‌‌ని ఒక్క్ ప్రాంచైజీ కూడా సెలెక్షన్ చేసుకోలేదు. అతడినొక బౌలర్‌గానే గుర్తించలేదు. ఎక్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (03:57 IST)
ఒక అసాధారణ బౌలర్‌ను ఎంతగా అవమానించాలో అంతగా అవమానించాయి ఐపీఎల్ ఫ్రాంచైజి యాజమాన్యాలు. అప్పటికే వన్డేలు, టీ 20ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఆ అత్యుత్తమ స్పిన్నర్‌‌ని ఒక్క్ ప్రాంచైజీ కూడా సెలెక్షన్ చేసుకోలేదు. అతడినొక బౌలర్‌గానే గుర్తించలేదు. ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఎంత అవమాన భారాన్ని దిగమింగుకున్నాడో మరి కానీ గాయాల కారణంగా ఒకరిద్దరు బౌలర్లు ఐపీఎల్‌కి దూరమైన క్షణాల్లో అదృష్టం కొద్దీ అడుగుపెట్టిన ఆ బౌలర్ తొలి మ్యాచ్‌లోనే తన తడాఖా చూపించాడు. 
 
అతడే దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. ఐపీఎల్‌ వేలంలో కనీస ధర అయిన 50 లక్షల్ని పెట్టి అతడిని కొనడానికి కూడా ఏ ప్రాంచైజ్‌కీ మనసొప్పలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్‌లో అమ్మకానికి అబ్బాయిలు కానివారిలో అతడొకడుగా మిగిలిపోయాడు. గాయల కారణంగా ఒకరిద్దరు ఐపీఎల్‌కు దూరమవడంతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తాహిర్‌ను జట్టులోకి తీసుకుంది. అది తిరుపతి లఢ్డూ దొరకడం లాంటి బంగారు అవకాశమై దక్కింది. 
 
తాహిర్‌ను ఎందుకులే అని అనుకున్న ఫ్రాంచైజీలకే షాక్ తగిలేలా తొలి మ్యాచ్‌లో విజృంభించాడు తాహిర్. నన్నే విస్మరిస్తారా అని బాధపడ్డాడో ఏమో కానీ గురువారం తన తొలి మ్యాచ్‌లోనే ప్రతాపం చూపాడు. తన తొలి రెండు ఓవర్లలోనే మూడు వికెట్టు పడగొట్టి కసి తీర్చుకున్నాడు. 5వ ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ పార్థివ్ పటేల్‌ను, 7వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, బట్లర్‌ను ఔట్ చేశాడు, పార్థివ్, రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ అవ్వగా, బట్లర్ ఎల్‌బీడబ్ల్యూ‌ అయి వెనుతిరిగాడు.
 
అవమానం జరిగిన చోటే విజయానికి దారులు ఉంటాయన్నది నానుడి. తాహిర్ తనకు జరిగిన అవమానానికి సరైన రీతిలో కసి తీర్చుకున్నాడు. ప్రతిభ ఉంటే చిన్న 
అవకాశం దొరికితే చాలు ఆటగాళ్లు ఎలాంటి బీభత్స ప్రదర్శన చేస్తారో, చేయగలరో తెలిపిన అరుదైన్ బౌలర్ తాహిర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

తర్వాతి కథనం
Show comments