Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రోజు రెండో హ్యాట్రిక్: పుల్ జోష్‌లో ఐపీఎల్-10

ఐపీఎల్-10 సీజన్‌కు మంచిరోజులు వచ్చినట్లే.. ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదైన అరుదైన దృశ్యం శనివారం నమోదు కాగా ఐపీఎల్-10 సీజన్ లో వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్లే అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (01:50 IST)
ఐపీఎల్-10 సీజన్‌కు మంచిరోజులు వచ్చినట్లే.. ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదైన అరుదైన దృశ్యం శనివారం నమోదు కాగా ఐపీఎల్-10 సీజన్ లో వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్లే అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్ క్రికెట్‌కు జోష్ తగ్గిందని వస్తున్న వార్తలను ఈ మూడు ఘటనలూ ఒకే రోజు సంభవించి ఒక్కసారిగా హైప్ పెంచేశాయి.
 
శుక్రవారం జరిగిన ఐపీఎల్-10 సీజన్ మ్యాచ్‌లలో వరుస హ్యాట్రిక్‌లు సంభవించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ శామ్యూల్ బద్రి (వెస్టిండీస్) బెంగళూరులో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.
 
కొన్ని గంటల వ్యవధిలోనే రెండో మ్యాచ్‌లో కూడా హ్యాట్రిక్ నమోదయింది. రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌ బౌలర్ ఆండ్రూ టై చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఈ అద్భుతం సాధించాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ బ్యాట్స్‌మెన్ అంకిత్ శర్మ, మనోజ్ తివారీ, ఎస్‌ఎన్ ఠాకూర్‌లను ఔట్ చేశాడు. మొదటి ఇద్దరు క్యాచ్ రూపంలో ఔటవ్వగా, మూడో బ్యాట్స్‌మన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. డెత్ ఓవర్లు వేయడానికి ఇష్టపడే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై చిట్టచివరి ఓవర్‌లో తన ప్రతాపం చూపాడు.  మూడు వికెట్లు కోల్పోయిన పుణె ఆ ఓవర్‌లో కేవలం 4 పరుగులు సాధించిది. నాలుగు ఓవర్లు వేసిన టై 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. హ్యాట్రిక్‌తో పుణె నడ్డివిరిచిన గుజరాత్‌ బౌలర్‌ ఏజే టై(4-0-17-5)కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 
 
ఒకే రోజు రెండు సంచలనాలతో ఐపీఎల్‌ హోరెత్తిపోయింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments