ఐపీఎల్ 2024.. ఆర్సీబీ మ్యాచ్ చూడాలా.. టిక్కెట్ ధర రూ.52,938లు

సెల్వి
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:15 IST)
భారీ టికెట్ డిమాండ్ గురించి తెలుసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ గేట్ కలెక్షన్‌ను పెంచుకోవడానికి సర్జ్ ప్రైసింగ్, డైనమిక్-రేట్ల వ్యూహాలను అవలంబిస్తున్నారు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు సంబంధించిన మ్యాచ్ టిక్కెట్ రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ఓ ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్ ధర ఎంత? రూ. 52,938లు అంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రారంభ హోమ్ గేమ్ కోసం టిక్కెట్ ధర భారీగా పలుకుతోంది.
 
అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఆడే మ్యాచ్ ధర రూ.499లకే లభిస్తోంది. ఇందులో అసలు విషయం ఏంటంటే.. అగ్రశ్రేణి తారలు పాల్గొనే కీలక పోటీలకు భారీ టికెట్ డిమాండ్ గురించి తెలుసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు తమ గేట్ కలెక్షన్‌ను పెంచుకోవడానికి సర్జ్ ప్రైసింగ్, డైనమిక్-రేట్ల వ్యూహాలను అవలంబిస్తున్నారు.
 
 టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి బీసీసీఐ ఫ్రాంఛైజీకి స్వేచ్ఛనిస్తుంది. దీంతో అభిమానులతో స్టాండ్‌లు నిండిపోతున్నాయి. 
 
అయితే ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫ్రాంచైజీలు స్వయంగా ధరను నిర్ణయిస్తున్నాయి. తద్వారా ఫ్రాంచైజీలు అధిక డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. బెంగళూరులో చౌకైన టిక్కెట్ ధర రూ. 2,300. ఆ విభాగంలో టోర్నమెంట్‌లో ఇదే అత్యధికం. 
 
ఇవి సర్జ్ ప్రైసింగ్ నుండి మినహాయించబడినప్పటికీ, మ్యాచ్ రోజు సమీపిస్తున్న కొద్దీ ఖరీదైన సీట్ల రేట్లు పెరుగుతాయి. ప్రారంభ మ్యాచ్‌లో ఫ్యాన్ టెర్రస్‌పైకి రూ.4,840 నుంచి రూ.6,292కి, కార్పొరేట్ స్టాండ్‌ల టికెట్ ధర రూ.42,350 నుంచి రూ.52,938కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments