Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేక పుట్టించి రేసులో నిలిచిన కోల్‌కతా - ముంబై చిత్తు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:19 IST)
ఐపీఎల్ 14 సీజన్ రెండో దశ పోటీలు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, గురువారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మరోమారు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓడిపోయింది. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడమేననే కామెంట్స్ వినిపించాయి. అయితే, గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మే కారణం కావడం గమనార్హం. ఫలితంగా ముంబై జట్టు దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ రేస్‌లో నిలబడాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు సభ్యులు సమిష్టిగా రాణించి వీరవిహారం చేశారు. ఫలితంగా కేకేఆర్ తన ప్రత్యర్థి ముంబై జట్టును చిత్తు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై తొలి బంతి నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును పరుగులు పెట్టించారు. రోహిత్ 30 బంతుల్లో 4 ఫోర్లతో 33, డికాక్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. వీరి దూకుడుకు స్కోరు 200 పరుగులు దాటుతుందని భావించారు. 
 
అయితే, వీరిద్దరూ అవుటయ్యాక స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. బ్యాటర్లు వరుసపెట్టి పెవిలియన్‌కు క్యూకట్టారు. సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్యా (12) దారుణంగా నిరాశ పరిచారు. పొలార్డ్ మాత్రం 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసి జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయడంలో సాయపడ్డాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, ఫెర్గ్యూసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్ ఓ వికెట్ తీసుకున్నాడు.
 
అనంతరం ముంబై నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే వెనుదిరిగినా, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వెంకటేశ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. 
 
కెప్టెన్ మోర్గాన్ 7, నితీశ్ రానా 5 (నాటౌట్) పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠీ విధ్వంసానికితోడు వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లూ బుమ్రాకే దక్కాయి. సునీల్ నరైన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, ముంబై ఆరో స్థానానికి పడిపోయింది. శుక్రవారం షార్జాలో బెంగళూరు-చెన్నై మధ్య ఐపీఎల్ 35వ మ్యాచ్ జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments