Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఏమైంది? అలసిపోయాడు.. పరిగెత్తలేకపోయాడు.. రికార్డ్ బ్రేక్ (Video)

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (14:05 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా ఓటములు చవిచూస్తోంది. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 165 పరుగులు కూడా ఛేజింగ్ చేయలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోని ఆఖరి వరకూ క్రీజులో ఉన్నా కూడా మునుపటిలా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇక ఆఖరి రెండు ఓవర్లలో మహేంద్ర సింగ్ ధోని ఎంతగానో ఇబ్బంది పడ్డాడు.
 
ధోని (36 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచినప్పటికీ.. రన్ రేట్‌కు తగ్గట్టుగా ఆడలేక అలసిపోయినట్లు కనిపించాడు. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌లను చెన్నై ఓడిపోయింది. 2014 ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడటం ఇదే తొలిసారి. 
 
ధోని దగ్గుతూ కనిపించాడు.. తాను ఎంతగానో అలసిపోయినట్లు కనిపించాడు. వికెట్ల మధ్య బాగా పరిగెత్తినా.. ఈ మ్యాచ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితిలోకి వెళ్లాడు. దుబాయ్‌లో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్న కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ధోనీ వివరించాడు. 
 
తాను గ్రౌండ్‌లో ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ సమయం ఉండటానికి ప్రయత్నించాను. కానీ అక్కడ చాలా పొడిగా ఉంది. దాంతో గొంతు పూర్తిగా డ్రై అయిపోయింది. దాంతో దగ్గు వచ్చింది. అయినా కానీ టీమ్ గెలుపు కోసం దాన్ని భరించేందుకు అంగీకరించానని అన్నాడు.
 
అయితే ఐపీఎల్ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఘనత ధోని (194) సృష్టించాడు. ఇప్పటివరకు సురేశ్‌ రైనా (193) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ శర్మ(192) కూడా ఈ రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayamma’s 69th Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments