Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సందడి : క్రికెట్ ప్రియుల కోసం జియో నయా ప్లాన్స్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:33 IST)
వచ్చే నెలలో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభంకానుంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఐపీఎల్ జట్లు ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్నాయి. అయితే, ఈ ఐపీఎల 2020ని పురస్కరించుకుని రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది.
 
జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్స్ విలువ రూ.499, రూ.777గా ఉండనుంది. ఈ ప్లాన్లలో 399 రూపాయల విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచిత చందాను ఒక యేడాది పాటు అందివ్వనుంది. 
 
తద్వారా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మైజియో యాప్ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. 
 
కాగా, రూ.499 క్రికెట్ ప్లాన్ ప్రకారం ఐపీఎల్ సీజన్ మొత్తం రోజుకు 1.5 హై స్పీడ్ డేటాతో 56 రోజులు పాటు అందిస్తుంది. వీటితో పాటు.. డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ చందా ఏడాది ఉచితం. అయితే, ఈ ప్లాన్ కింద ఎలాంటి ఫోన్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉండదు. 
 
ఇకపోతే రూ.777 క్రికెట్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ కింద, 5 జీబీ అదనపు డేటాతో 1.5 జీబీ రోజువారీ హైస్పీడ్ డేటా, అపరిమిత జియో టూ జియో కాలింగ్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000 ఎఫ్‌యుపి నిమిషాలు రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌లు పంపించుకునే వెసులుబాటు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments