Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాప్ రే బాప్... జడ్డూ సిక్సర్లపై సాక్షి ధోని కామెంట్స్...

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:03 IST)
ఐపీఎల్ 13వ సీజన్ లీక్ దశ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను వదులుకుంది. అయితే, ఆ జట్టుకు మిగిలివున్న నామమాత్రపు మ్యాచ్‌లలో సీఎస్కే ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫలితంగా వరుస మ్యాచ్‌లలో విజయకేతనం ఎగురవేస్తున్నారు.
 
తాజాగా గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై అద్భుత రీతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ గెలిచింది. చేజింగ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో ర‌వీంద్ర జ‌డేజా.. చివ‌రి రెండు బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచి జ‌ట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. అత్యంత ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌పై చెన్నై కెప్టెన్ ధోనీ భార్య సాక్షి ధోని రియాక్ట్ అయ్యారు. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో జ‌డేజాపై ఆమె కామెంట్ చేసింది. 
 
ఇన్నింగ్స్ చివ‌రి రెండు బంతుల్ని సిక్స‌ర్ కొట్టిన జ‌డేజాను మెచ్చుకుంటూ 'బాప్ రే బాప్' అన్న కామెంట్ చేసిందామె. కోల్‌క‌తా బౌల‌ర్ నాగ‌కోటి వేసిన బౌలింగ్‌లో జ‌డేజా చెల‌రేగిన తీరు అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. ఫెర్గూస‌న్ వేసిన 19వ ఓవ‌ర్‌లోనూ జ‌డేజా భారీ షాట్ల‌తో అల‌రించాడు. 
 
ఈ మ్యాచ్‌లో జ‌డ్డూ 11 బంతుల్లో 31 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. నెట్స్‌లో బాల్‌ను బాగా హిట్ చేశాన‌ని, ఆ న‌మ్మ‌కంతోనే చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో భారీ షాట్లు కొట్టిన‌ట్లు జ‌డేజా తెలిపాడు. తొలుత కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 172 ర‌న్స్ చేయ‌గా.. ఆ ల‌క్ష్యాన్ని చివ‌రి బంతికి చెన్నై చేధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments