Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ను తాకిన కావేరి సెగ.. చెన్నై టీమ్‌కు కష్టాలు తప్పవా?

కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు నల్ల బ్యాడ్జి ధరించి క్రికెట్ మైదానంలో ఆడాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. అయితే ఐపీఎల్ మ్యాచ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:01 IST)
కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు నల్ల బ్యాడ్జి ధరించి క్రికెట్ మైదానంలో ఆడాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకోవాలని ఇప్పటికే తమిళ సంఘాలు పిలుపునిచ్చాయి. స్టేడియంలో అలజడి సృష్టించేందుకు నిరసనకారులు సమాయత్తం అవుతున్నారు. చెన్నై ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకునే దిశగా నిరసనకారులు భారీగా టిక్కెట్లు కొన్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందించిన ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కేదార్ జాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7.8 కోట్లకు కొనుగోలు చేసింది.
 
జట్టు కోరుకున్నట్టే ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌‌గా క్రీజులోకి దిగిన కేదార్ జాదవ్‌ తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌‌గా వెనుదిరిగాడు. కీలక దశలో మళ్లీ క్రీజులోకి వచ్చిన కేదార్.. జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. కానీ గాయం తీవ్రత అధికంగా వుండటంతో టోర్నీ నుంచి కేదార్ జాదవ్ దూరమైనట్లు కోచ్ మైకేస్ హస్సీ చెప్పాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments