Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018: అదరహో.. అంబటి.. హైదరాబాద్‌పై చెన్నై ఘనవిజయం

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా చెన్నై విజయభేరీ మోగించింది.

Webdunia
సోమవారం, 14 మే 2018 (11:07 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా చెన్నై విజయభేరీ మోగించింది.
 
ఆదివారం తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 79 పరుగులు చేయగా, విలియమ్సన్‌ 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 51 రన్స్ చేసింది. 
 
ఆ తర్వాత 180 పరుగుల ఛేదనలో రాయుడు ప్రత్యర్థికి ఊపిరాడనీయలేదు. ఈ ఐపీఎల్‌లో గొప్ప బౌలింగ్‌ దళంగా పేరుపడిన సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు. భువి బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టిన అంబటి.. ఇక ఆగలేదు. పరుగులు ఇవ్వడంలో పిసినారులైన షకిబ్‌, రషీద్‌ఖాన్‌, కౌల్‌ బౌలింగ్‌నైతే ఉతికేశాడు. కౌల్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌తో అర్థసెంచరీ చేసుకున్న రాయుడు.. రషీద్‌కూ ఓ సిక్స్‌ వడ్డించాడు. 
 
ముఖ్యంగా, అంబటి రాయుడు 62 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 100 (నాటౌట్) సన్‌రైజర్స్‌ బౌలర్లను ఉతికారేశాడు. అలాగే, అతనితో పాటు వాట్సన్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో చెలరేగడంతో 57 పరుగులతే చెలరేగిపోయాడు. ఫలితంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్లతో చిత్తు చేసిన చెన్నై (12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు) పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments