Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి జింటా అత్యాశ కొంపముంచిందట... ముంబై ఓడితే అంత హ్యాపీనా? (video)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్‌లో భాగంగా ఆదివారం పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తె

Webdunia
సోమవారం, 21 మే 2018 (15:49 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్‌లో భాగంగా ఆదివారం పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి ముందు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. కానీ, ముంబై ఓడిపోయిందన్న వార్త తెలియగానే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా సంబరపడింది. 
 
ఎందుకంటే..? ఐపీఎల్ చివరి రెండు పోటీలు ప్రారంభమైన తరువాత, మధ్యాహ్నం జరిగిన ఢిల్లీ, ముంబై మ్యాచ్‌లో ముంబై గెలిచుంటే, మరో ఆప్షన్‌కు తావులేకుండా ఆ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుతుందని, తన జట్టు అయిన పంజాబ్‌కు అవకాశాలు ఉండవన్న ఆందోళనతో ఉన్న ప్రీతి జింటా, ముంబై జట్టు ఓడిపోయిందని తెలుసుకున్న తరువాత చూపిన ఆనందం, టీవీల్లో ప్లే కాగా, దానిని తన మొబైల్‌లో రికార్డు చేసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. 
 
ప్రీతి హ్యాపీగా తన పక్కనున్న వ్యక్తితో.. తానిప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పడం, నవ్వుతుండటం చూసిన ముంబై ఫ్యాన్స్ ట్రాల్ చేస్తూ ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాలి.. అలాగే చెన్నైను పంజాబ్ 53 పరుగుల తేడాతో ఓడించాలి. పంజాబ్ కోరుకున్నట్లుగానే ఢిల్లీ.. ముంబైను ఓడించింది. 
 
కాకపోతే పంజాబ్ కూడా చెన్నై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా తన ట్విట్టర్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కానీ అయితే పంజాబ్ చెన్నై చేతిలో ఓడిపోవడంతో ప్రీతి అత్యాశ ఆ జట్టు కొంపముంచిందని కూడా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments