Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టర్ గోయెంకా! నీ మొహం అద్దంలో చూసుకో' : అంబటి రాయుడు

జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై విమర్శలు చేసిన పూణె జట్టు యజమాని సంజీవ్ గోయంకా సోదరుడు హర్షా గోయంకాపై ముంబై జట్టు ఆటగాడు అంబటిరాయుడు తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడం

Webdunia
జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై విమర్శలు చేసిన పూణె జట్టు యజమాని సంజీవ్ గోయంకా సోదరుడు హర్షా గోయంకాపై ముంబై జట్టు ఆటగాడు అంబటిరాయుడు తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ ధోనీకి కితాబిచ్చిన రాయుడు... గోయెంకాకు ఎవరైనా ఓ అద్దాన్ని బహుమతిగా ఇవ్వాలంటూ ట్వీట్ చేశాడు. 'మిస్టర్ గోయెంకా! నీ మొహం అద్దంలో చూసుకో' అని ఇన్ డైరెక్ట్ గా రాయుడు కామెంట్ చేశాడు.
 
ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ వరుసగా విఫలం కావడంతో 'అడవికి రారాజు స్మిత్' అంటూ ధోనీని కించపరుస్తూ పూణె టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా సోదరుడు హర్షా గోయంకా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా చెలరేగాయి. క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించాడు. మ్యాచ్ను గెలవాలంటే మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన తరుణంలో... తనదైన శైలిలో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు ధోనీ. కేవలం 34 బంతుల్లో 61 పరుగులు చేసి తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. దీంతో అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

తర్వాతి కథనం
Show comments