Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టు గెలిచిందని టీవీ ముందు దుస్తులిప్పేసి గెంతులేసిన క్రికెటర్ ఎవరు?

క్రీడల్లో గెలుపోటములు సహజం. గెలిచినపుడు ఆకాశమే హద్దుగా ఆనందంలో మునిగిపోయే క్రీడాకారులు.. ఓడిపోయినపుడు అంతే కుంగిపోతుంటారు. తాజాగా ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ క్రికెటర్ తమ జట్టు గెలిచిన ఆనందంలో టీవీ ము

Webdunia
క్రీడల్లో గెలుపోటములు సహజం. గెలిచినపుడు ఆకాశమే హద్దుగా ఆనందంలో మునిగిపోయే క్రీడాకారులు.. ఓడిపోయినపుడు అంతే కుంగిపోతుంటారు. తాజాగా ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ క్రికెటర్ తమ జట్టు గెలిచిన ఆనందంలో టీవీ ముందు దుస్తులిప్పేసిన గెంతులేశాడు. పైగా, తానేదో ఘనకార్యం తీసినట్టు ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఐపీఎల్ పదో అంచె పోటీల్లో భాగంగా ఫైనల్ పోరు ఆదివారం రాత్రి హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో జరిగింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ముంబై ఇండియన్స్‌ జట్టు ఆటగాడు జోస్‌ బట్లర్‌ ఆనందం కట్టలు తెగింది. అంతే వినూత్నంగా ఆ సంబరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడమే కాదు.. తాను చేసిన ఒకింత వింత, వికృత ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి అభిమానులతో పంచుకున్నాడు.
 
జట్టు విజయం సాధించడంతో బట్లర్‌ ఆనందంలో కట్టుకున్న టవల్‌ను విప్సేసి.. నగ్నంగా గంతులు వేశాడు. 'సావరియా' సినిమాలో రణ్‌బీర్‌ సింగ్‌ను గుర్తుకుతెచ్చేలా అతను వేసిన నగ్న గంతుల వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు జోస్‌ బట్లర్‌ కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అతను ఫైనల్‌కు ముందే ఇంగ్లండ్‌కు వెళ్లిపోయి.. తమ జట్టులో చేరాడు. ఫైనల్‌లో అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఫైనల్‌ మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన ఈ ఇంగ్లీష్‌ వికెట్‌ కీపర్‌ తనదైన స్టైల్‌లో జట్టు ఆనందంలో భాగమయ్యాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

Dharmasthala: బాలికను అక్రమంగా ఖననం చేయడాన్ని కళ్లారా చూశాను.. ఎవరు?

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments