Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని గంగూలీ ఏకిపారేస్తే.. షేన్ వార్న్ అండగా నిలిచాడు.. మహీకి ఆ అవసరం లేదంటూ ట్వీట్..

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ ధోనీ ప్రదర్శనపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదన

Webdunia
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ ధోనీ ప్రదర్శనపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'ధోని వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్ ప్లేయర్. కానీ టీ20ల్లో ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని తానైతే అనుకోవట్లేదని గంగూలీ ఇటీవల కామెంట్లు చేశాడు. 
 
ఇందుకు కారణం పదేళ్ల ట్వంటీ-20 కెరీర్లో అతడు సాధించింది.. ఏకై అర్థ సెంచరీ మాత్రమేనని గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా ధోనీని గంగూలీ ఏకిపారేశాడు. ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభంలో పూణే కెప్టెన్సీ నుంచి తప్పించి కొందరు అవమానిస్తే.. క్రికెటర్‌గా, ఓ జట్టు సభ్యుడిగా బరిలోకి దిగిన ధోనీ ఆటతీరుపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 
 
ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోని ప్రస్తుత సీజన్‌లో మెరుగ్గా రాణించట్లేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ధోని 12 నాటౌట్, 5, 11, 5, 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో ధోనికి గడ్డు కాలం నడుస్తోంది. కెప్టెన్స్ నుంచి ధోనిని తప్పించడంతో జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దీంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ లెజండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ధోనీకి గట్టిగా అండగా నిలబడ్డాడు. ధోని ఎవరి దగ్గర తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అతను గొప్ప స్ఫూర్తిదాయకమైన కెప్టెన్‌ అంటూ షేన్ వార్న్ కొనియాడాడు.
 
ఈ నేపథ్యంలో షేన్‌ వార్న్‌ ట్విట్టర్‌లో ధోనీ గురించి స్పందించాడు. ధోనీ తన సత్తాను ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అన్నీ ఫార్మెట్లలోనూ అతడు అద్భుతమైన క్లాస్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. ఇంకా స్ఫూర్తిదాయకంగా నిలిచే గొప్ప కెప్టెన్ ధోనీ అంటూ ట్వీట్ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments