Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు ప్రాక్టీస్ : చొక్కాలు విప్పిమరీ బంతిని బాదేస్తున్నారు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు విజయం కోసం శ్రమిస్తున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ఓ వైపు ఉక్కపోత, మరోవైపు ప్రాక్ట

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు విజయం కోసం శ్రమిస్తున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ఓ వైపు ఉక్కపోత, మరోవైపు ప్రాక్టీస్‌తో వారు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా చొక్కాలు విప్పి మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి కారణం ఉక్కపోత. ఈ ఉక్కపోతను విదేశీ ఆటగాళ్లు తట్టుకోలేక పోతున్నారు. దీంతో ఉక్కపోత కారణంగా పలువురు ఆటగాళ్లు ప్రాక్టీసు సమయంలో చొక్కాలు తీసేస్తున్నారు.
 
తాజాగా ప్రస్తుత సీజన్‌లో వరుస ఓటములను చవిచూస్తున్మన పంజాబ్‌ జట్టు తదుపరి మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో బలహీనంగా ఉండటం వల్లే గత మ్యాచ్‌లో ఓడిపోయినట్లు పంజాబ్‌ సారథి మ్యాక్స్‌వెల్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ముంబైతో జరిగే మ్యాచ్‌లో అన్ని రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచాలని పంజాబ్‌ భావిస్తోంది.
 
ఈ క్రమంలో వేడిని సైతం లెక్కచేయకుండా పంజాబ్‌ ఆటగాళ్లు నెట్స్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఉక్కపోత కారణంగా అల్లాడుతున్న విదేశీ ఆటగాళ్లు డేవిడ్‌ మిల్లర్‌, స్టాయినిస్‌ చొక్కాలు తీసేసి మరీ ప్రాక్టీసులో పాల్గొన్నారు. పంజాబ్‌ జట్టు సారథి మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించాలని మ్యాక్స్‌వెల్‌ కసిగా ఉన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments