Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేల్, కోహ్లీ పరుగుల సునామీ.. ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం

పరుగుల సునామీ క్రిస్‌గేల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో 10వేల పరుగుల మైలురాయికి కావల్సిన మూడు పరుగులు పూ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (01:40 IST)
పరుగుల సునామీ క్రిస్‌గేల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో 10వేల పరుగుల మైలురాయికి కావల్సిన మూడు పరుగులు పూర్తి చేసి టీ20 చరిత్రలో 10వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకున్న అనంతరం క్రిస్‌గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సాయంతో గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గేల్‌(77: 38 బంతుల్లో 5×4, 7×6), విరాట్‌ కోహ్లి(64:50బంతుల్లో 7×4,1×6) చెలరేగడంతో రెండు వికెట్లకు బెంగళూరు 213 పరుగులు చేసింది.



గేల్, కోహ్లీ సునామీ బారిన పడిన గుజరాత్ లయన్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో గౌరవనీయమైన స్కోరు చేసినప్పటికీ ఒత్తిడితో తడబడి కుదేలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడ గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేసి ఓటమిపాలైంది. 
 
ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గేల్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. తద్వారా ఈ సీజన్ లో తొలి హాఫ్ సెంచరీని గేల్ సాధించాడు. మరొకవైపు కోహ్లి కూడా క్లాస్ టచ్ ఇచ్చాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగుల్ని కోహ్లి నమోదు చేశాడు. ఈ జోడి తొలి వికెట్ కు 122 పరుగుల్ని జోడించిన తరువాత గేల్ అవుటయ్యాడు.ఆ తరువాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి జోరును మరింత పెంచే క్రమంలో రెండో వికెట్ గా పెవిలియన్‌కు చేరాడు. అయితే చివర్లో ట్రావిస్ హెడ్(30 నాటౌట్;16 బంతుల్లో 2 సిక్సర్లు,1 సిక్స్), కేదర్ జాదవ్(38 నాటౌట్; 15 బంతుల్లో 5 ఫోర్లు2 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
 
214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు వద్ద ఓపెనర్ డ్వేన్ స్మిత్ వికెట్ కోల్పోయింది. ఆపై దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ రైనా(23 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను చాహల్ ఔట్ చేశాడు. మూడో వికెట్ కు ఫించ్ (19)తో కలిసి మెకల్లమ్(72 44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) 66 పరుగులు జోడించాడు. దినేష్ కార్తిక్(1) విఫలమయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి జడేజా(23) రనౌటయ్యాడు. చివర్లో ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో నిర్ణీత ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది. 21 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments