Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని తప్పుబట్టాను.. అందుకే క్షమాపణలు తెలియజేస్తున్నా: బ్రాడ్ హాగ్

ఆస్ట్రేలియా భారత గడ్డపై ఓడిపోవడంపై ఆ దేశ మీడియాతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా క్రికెటర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట

Webdunia
ఆస్ట్రేలియా భారత గడ్డపై ఓడిపోవడంపై ఆ దేశ మీడియాతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా క్రికెటర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో నిర్ణయాత్మక ధర్మశాల టెస్టు నుంచి గాయం కారణంగా కోహ్లీ తప్పుకుంటే.. కోహ్లీ వైదొలగడానికి కారణం ఐపీఎలేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ కామెంట్స్ చేశాడు. 
 
ఐపీఎల్ కోసమే కోహ్లీ ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడని తాను అర్థం చేసుకున్నానే తప్ప.. కోహ్లీని కించపరిచేందుకు కాదని హాగ్ స్పష్టం చేశాడు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా గాయపరిచి ఉంటే క్షమించమని విజ్ఞప్తి చేశాడు. తన ఉద్దేశం ఏ ఒక్క ఆటగాడిని గాయపరచాలని కాదని తెలిపాడు. 
 
చాలామంది క్రికెటర్లు క్యాష్ రిచ్ టోర్నీ అయిన ఐపీఎల్‌కు ముందు నుంచే సిద్ధమవుతారని.. గతంలో కూడా ఐపీఎల్ కారణంగా పలువురు ఆటగాళ్లు దేశం తరపున ఆడే మ్యాచ్‌లను వదులుకుంటారని గుర్తు చేశాడు. అందుకే కోహ్లీని తప్పుబట్టినట్లు చెప్పాడు. అందుకే కోహ్లీ కూడా క్షమాపణలు తెలియజేస్తున్నానని హాగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాగా.. బ్రాడ్ హాగ్ గుజరాత్‌ లయన్స్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments