Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-10: బెంగళూరుకు మరో దెబ్బ.. డివిలియర్స్‌కు వెన్నునొప్పి.. డౌటేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ పదో సీజన్ నుంచి స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్‌‍లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే కోహ్లీ దూరమైన నేపథ్యంలోఆ జట్

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ పదో సీజన్ నుంచి స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్‌‍లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే కోహ్లీ దూరమైన నేపథ్యంలోఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఐపీఎల్‌లో బెంగుళూరుకు చెందిన ఏబీ డివిలియర్స్‌ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో భాగంగా జరుగుతున్న మూమెంటమ్‌ వన్డే కప్‌లో ఏబీ డివిలియర్స్ ఆడాల్సి ఉంది. కానీ వెన్నునొప్పి కారణంగా డివిలియర్స్‌ వన్డే కప్‌కి దూరమైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. డివిలియర్స్‌కి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో.. ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
నిజానికి సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్కులో జరిగే మూమెంటమ్‌ వన్డే కప్‌లో టైటాన్స్‌తో జరిగే ఫైనల్స్‌లో ఏబీ డివిలియర్స్ ఆడాల్సి ఉంది. ఐతే ఉన్నట్టుండి వెన్నునొప్పితో ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో డివిలియర్స్‌ ఐపీఎల్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments