Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మగధీర"తో నటించడం లేదు: కాజల్ అగర్వాల్

Webdunia
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన "మగధీర" చిత్రం తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని నటి కాజల్ అగర్వాల్ అంటోంది. తాజాగా ఆమె అశ్వనీదత్ కుమార్తె శేషుగుప్తా నిర్మిస్తోన్న "ఓం శాంతి" చిత్రంలో నటిస్తోంది. 

నవదీప్, అఖిల్, అతిది శర్మ, బిందు మాధవిలతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన పలు విషయాలు మీ కోసం..

ప్రశ్న: "ఓం శాంతి" అంటే అర్థమేమిటి?
జ: ఓం అనేది బిగినింగ్‌కు వాడుతాం. శాంతి అనేది ఎండింగ్. ఐదుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అందరి కథలు ఒక చోట ఆరంభమై చివరికి శాంతియుతంగా ముగుస్తాయి. నేను ఇందులో మేహన అనే పాత్ర పోషించాను. ప్రతి విషయంలోనూ డేర్‌గా ఉంటూ దేన్ని లెక్కచేయని తత్త్వం. అటువంటి పాత్ర చివరిలో ఒక మార్పుకు గురవుతుంది. అది ఏమిటి? మిగిలిన నాలుగు పాత్రల సంగతి ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే..!

ప్రశ్న: 'మగధీర' వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలో హీరోయిన్‌గా చేసి ఐదుగురిలో ఒకరిగా నటించడానికి కారణం?
జ: కొత్తదనంగా చేయాలని ఇందులో నటించాను. ఈ కథ నచ్చింది. హీరోయిన్ ప్రధానమైన చిత్రంలో చేసినా 'ఓం శాంతి'లో కూడా కీలక పాత్ర పోషించాను. నేను ఇప్పటివరకు చేసినవన్నీ వైవిధ్యమైన పాత్రలే.

ప్రశ్న: బాలీవుడ్ రంగప్రవేశం చేసే ఆలోచన ఉందా?
జ: నాకు ఇక్కడే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నాకెంతో నేర్పింది. నా కెరీర్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. బాలీవుడ్‌లో కూడా కథలు విన్నాను. కానీ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నందువల్ల వాటిని పోస్ట్‌పాన్ చేశాను.

ప్రశ్న: ప్రస్తుతం చేస్తున్న చిత్ర వివరాలు?
జ: ప్రభాస్‌తో 'డార్లింగ్'. ఎన్టీఆర్‌తో 'బృందావనం', కార్తీక్‌తో "నాన్ మహాన్ ఇళ్ళై (తమిళం)" వంటి చేస్తున్నాను.

ప్రశ్న: రామ్‌చరణ్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారని నాగబాబు ప్రకటించారు?
జ: అందులో చేయడం లేదు. ఇంతవరకు అగ్రిమెంట్లో సంతకం కూడా పెట్టలేదు.

ప్రశ్న: అల్లు అర్జున్‌తో ఆర్య-2లో నటించడం ఎలాంటి అనుభూతి కలిగింది?
జ: నిజంగా చాలా థ్రిల్‌కు గురయ్యాను. అర్జున్ డ్యాన్స్‌లో చాలా ఫాస్ట్. ఒకవైపు 'మగధీర' షూటింగ్ చేస్తూ, మరోవైపు 'ఆర్య-2' చిత్రంలో షూటింగ్ చేసేదాన్ని. డే బై డే షూటింగ్ గొప్ప అనుభవం. ఒకరకంగా నేటి యువహీరోలనుంచి నటన, ప్రవర్తన చాలా నేర్చుకున్నాను. అలాగే దర్శకుల ద్వారా చాలామంచిని గ్రహించాను.
 
WD


ప్రశ్న: గాసిప్స్‌ను ఎలా రిసీవ్‌చేసుకుంటారు?
జ: అవి పుకార్లుగానే కొట్టిపారేస్తాను. నిజమయితే ఇబ్బంది పడాలి. మా కుటుంబసభ్యలు వాటిని పట్టించుకోవద్దనే చెబుతారు. పాపులర్ అయిన తర్వాత వారి జీవితాల గురించి రకరకాలైన వార్తలొస్తుంటే.. నాకు తల్లిదండ్రులు ధైర్యం చెబుతుంటారు.

ప్రశ్న: నిజజీవితంలో ఎవరినైనా ప్రేమించారా?
జ: ఇప్పటివరకు లేదు. అంత తీరికలేదు. ఎప్పుడు సినిమా గురించే ఆలోచిస్తాను.

ప్రశ్న: ఎం.ఎస్. రాజు చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది?
జ: అవును. ఆ చిత్రం పేరు "ఛండీ". ఒకరకంగా చెప్పాలంటే..? అనుష్కకు అరుంథతి ఎలా నప్పిందో నాకు ఈ సినిమా అలాగే ఉంటుంది. లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్.

ప్రశ్న: మీ గ్లామర్ రహస్యం?
జ: ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తాను. కాసేపు చిన్నపాటి వ్యాయామాలు చేస్తాను. నాకు నచ్చిన వంటకాలు తింటాను. ఆయిల్ తక్కువగా తీసుకుంటాను. ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటాను. ఇంతకంటే రహస్యాలు లేవు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

Father: కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నం.. తాగిన మైకంలో శరీర భాగాలు తాకుతూ?

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Show comments