Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా... విక్రమ్‌ ఇంటర్వ్యూ

Webdunia
సోమవారం, 19 జనవరి 2015 (19:47 IST)
విక్రమ్‌ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ 'రావణ్‌'తో ముందుకు వచ్చిన విక్రమ్‌ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం 'ఐ'. తెలుగులో అదే పేరుతో డబ్‌ చేయబడింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్‌ సోమవారం నాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.. 
 
రిలీజ్‌ తర్వాత ఎంత పరేషాన్‌ అయ్యారు? 
నేను పరేషాన్‌ అయ్యేంతగా ఆదరించారు. అన్ని భాషల్లోనూ రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. చాలాచాలా సంతోషంగా వుంది.
 
గత చిత్రాలకు దీనికి ఎంత తేడా వుంది? 
గత సినిమాలు మామూలుగా వుంటాయి. కానీ ఇందులో వేరియేషన్స్‌ పాత్ర పరంగా వున్నాయి. అందుకోసం చాలా హార్డ్‌వర్క్‌ చేయాల్సి వచ్చింది. ఇన్నిరోజులు ఏమి జరిగిందో, ఏం చేశామో అనేది  ఎక్సైట్మెంట్‌ వుంది. 
 
సినిమా మూడేళ్ళు పట్టింది. అంత అవసరమా? 
ఎంతకాలం అనేది పట్టించుకోను. 'ఐ లవ్‌ యాక్టింగ్‌'. ఇలాంటి సినిమాకు ఇది అవసరం. అదంతా పిక్చర్‌లోనే చూడాలి. పెద్ద బడ్జెట్‌ సినిమాలను తెరపైనే చూస్తేనే అందంగా కన్పిస్తుంది. చైనాలో షూటింగ్‌. భారీ షెడ్యూల్స్‌. సెటప్స్‌. ఇలా వున్నాయి. ఒక్కో ఫైట్‌కు 12 రోజులు టైమ్‌ పట్టింది. 
 
రిలీజ్‌ తర్వాత సంతోషంగా వున్నారా? 
చెప్పలేనంత హ్యాపీ..
 
మొదటిరోజు నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది? 
అవును ఖచ్చితంగా వుంటుంది. సినిమా చాలా హైప్‌లో వుంది. ఈమధ్య ఇంత హైప్‌ ఏ సినిమాకూ లేదు. అందుకే సినిమా చూశాక.. దాన్నుంచి ప్రేక్షకుడు బయటకు రావడానికి టైమ్‌ పడుతుంది.  కొంతమంది విమర్శకులకు ఒక రకంగా అనిపించవచ్చు.  సినిమా రంగానికి చెందిన వారికి మరొకరకంగా అనిపించవచ్చు. ఏదిఏమైనా అన్నిచోట్ల మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చెన్నై, కేరళలలో మాగ్జిమమ్‌ థియేటర్లలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇప్పటికి 21 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఒక డబ్‌ సినిమాకు ఇలా రావడం చాలా గొప్ప విషయం.
 
ప్రమోషన్‌లో మృగం గెటప్‌తో ప్రేక్షకుడ్ని తప్పుదోవ పట్టించారు. సినిమాలో పెద్ద ప్రాధాన్యతలేదు? 
అలా ఏమీలేదు. చూసేవారి విజన్ బట్టి వుంటుంది. ఇక బీస్ట్‌ క్యారెక్టర్‌.. చూస్తే .. టీజర్‌ వరకే.. టీజర్‌ చూడకపోతే.. ఏదో అనుకుంటారు. థియేటర్‌కు రారు. అసలు బీస్ట్ బ్యూటీ మధ్య జరిగే లవ్వే ఈ సినిమా కథ. మరి ఇంతకంటే ఎలా పబ్లిసిటీ ఇవ్వమంటారు మీరే చెప్పండి!
 
హిందీలో రెస్పాన్స్‌ ఎలా వుంది? 
75 శాతం ఓపెనింగ్స్‌ వున్నాయి. అక్కడ పబ్లిసిటీ పెద్దగా లేదు. స్టార్‌ కాస్ట్‌లేదు. 
 
సెట్స్‌లో ఏడ్చారని నిర్మాత చెప్పారు. కారణం? 
అవును. ఏడ్వాల్సిన అవసరం ఏర్పడింది. అది కూడా సినిమా కోసమే. సినిమా అంటే తపన.. ఏ సినిమాకైనా.. పాత్రలో లీనమవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తాను.

 
మూడేళ్ళలో కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళారా? 
అది చేయలేకపోయాను. ఒకటిరెండు సార్లు మాత్రం మాస్క్‌ వేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ముఖ్యంగా బరువు తగ్గి.. పలుచగా వున్నప్పుడు అలా చేయాల్సి వచ్చింది. మిగిలిన టైమ్‌లో ఇల్లు, జిమ్‌. షూటింగ్‌ ఇంతే..
 
మూడు గెటప్‌లపరంగా ఏయే జాగ్రత్తలు తీసుకున్నారు? 
నాకు భరత్‌ అనే ట్రైనర్‌ వుండేవాడు. స్నేహితుడు కూడా. ఆయన చెప్పిన విధానం. ఆయనకు మరో అసిస్టెంట్‌.. బరువు పెరగడం, తగ్గడంతో పాటు... ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఉడకపెట్టిన కాయగూరలు తినాలి. ఆఫ్‌ బాయిల్‌ ఎగ్‌ తినాలి. కొద్దిగా అన్నం.. జ్యూస్‌ అంతే. ఒక్కోసారి సాయంత్రం 5 గంటల తర్వాత బాడీ అంతా ఏదోలా అనిపించేది. పిచ్చెక్కినట్లు వుండేది. దానికి ఓ డాక్టర్‌ కూడా పర్యవేక్షణ చేసేవారు. 
 
ఫిజియోథెరపిస్ట్‌ కూడా వుండేవాడు. అన్నిటికంటే బాడీ బిల్డర్‌గా కొంచెం కష్టపడ్డాను. అందగాడి గెటప్‌కు మామూలుగా వున్నప్పుడే తీశారు. మూడో గెటప్‌ .. కురూపిగా వున్న పాత్రకోసం... చాలా బరువుతగ్గాను. పన్ను కూడా పోగొట్టుకున్నాను. చాలా పీలగా మారాను. ఇదే చాలా కష్టమైన పాత్ర.
 
చైనాలో ఇంకా రిలీజ్‌ కాలేదు కదా? 
ఇంకా రిలీజ్‌ కాలేదు. ఫిబ్రవరిలో నూతన సంవత్సరం జరుగుతుంది. అప్పుడు రిలీజ్‌ చేస్తారు.
 
'గే'లను కించపర్చారని గొడవ జరుగుతుంది కదా? 
గే పాత్రను కించపరిచే సన్నివేశమే లేదు. షూటింగ్‌లో తను నాకు సపోర్ట్‌గా వున్నప్పుడు ఎలా వుండేదో తెరపైనే అలా వుంది. అది పాత్ర స్వభావంగా దర్శకుడు శంకర్‌ అలా చూపారు. అందులో తప్పేమిలేదు. ఒన్‌ పర్సెంట్‌ అటువంటివారు వుంటారు. వారి గురించి చెడ్డగా చెప్పిన సందర్భమూ లేదు అని ముగించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments