కళ్యాణి మాలిక్‌కు తిక్కుంది... హీరో నితిన్‌కు కూడా సరిచేయించాను... తేజ ఇంటర్వ్యూ

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2015 (15:38 IST)
తేజ. రెండక్షరాల ఈ పేరు.. తెలుగు సినిమా రంగంలో పెద్ద క్రేజ్‌.. యూత్‌ చిత్రాలంటే తేజనే తీయాలనే క్రేజ్‌ సంపాదించుకున్న ఆయన కెరీర్‌ కొద్దికాలం మందగించింది. అయితే ప్రస్తుతం ఆయన కొత్తవారితో చేసిన ప్రయోగం 'హోరాహోరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. రంజిత్‌ మూవీస్‌ పతాకంపై దామోదర ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 11న సినిమా విడుదలవుతుంది. కొత్తవారైనా, పాతవారైనా ఆయన చిత్రంలో చేయడమంటే కాస్త జంకుతారు. ఆయనకు కోపం ఎక్కువ... కొట్టేస్తారు. ఇటీవలే చిత్ర సంగీత దర్శకుడు.. కళ్యాణి మాలిక్‌ కూడా.. ఆయనతో పడలేనని అనడం, మళ్ళీ కాంప్రమైజ్‌ కావడం జరిగింది. అలాంటి తేజతో చిట్‌ చాట్‌.. 
 
అసలు ఈ హోరాహోరీ అంటే ఏమిటి? ఎవరి కోసం?
క్షురుక్షేత్ర యుద్ధం ఇన్ని రోజులు జరిగింది. అలాగే రామరావణ యుద్ధం హోరాహోరీగా జరిగందనేది తెలుసు. దానికోసం వాడిన పదమది. ఇక్కడ కూడా ఓ అమ్మాయి కోసం జరిగే హోరాహోరీ. హీరోయిన్‌ కోసం అందరూ ఎలా పోరాడారు అనేది కాన్సెప్ట్‌.
 
మీ సినిమాలు క్లాప్‌ నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు నటీనటుల మధ్య హోరాహోరీ జరుగుతుందని వార్తలు వస్తుంటాయి. ఈ సినిమాలో కూడా..?
ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగేది హోరాహోరీ. ఇక్కడ నటీనటులంతా కొత్తవారే. సామరస్యంగా జరిగేది. లోపల ఏమి వున్నా.. పైకిమాత్రం.. అలాగే సార్‌! అనేవారు. 
 
కళ్యాణిమాలిక్‌ మీరు హింసించారని చెప్పారు. దీనిపై ఎలా స్పందిస్తారు?
కళ్యాణి మాలిక్‌.. మీతో సినిమా చేయాలనుందని ఒకసారి అడిగారు. టైం వచ్చినప్పుడు చెబుతాలే అని అన్నాను. పైగా ఎక్కువ డబ్బులు ఇవ్వను. ఎక్కువ రోజులు పనిచేయించుకుంటాను. ఎక్కువ శ్రమ పెడతాను.. మీద ఒత్తిడి కూడా వుంటుంది. అనే రూల్స్‌ చెప్పాను. మొదట్లో ఎవరైనా.. నాతో పనిచేయడానిక వస్తే.. ఇలా చెబితే.. అందరూ ఓకే అంటారు. దిగాక లోతు తెలిసినట్లు.. పనిచేస్తున్నప్పుడే.... సాయంత్రం కాగానే.. వాచ్‌ చూసుకుని.. బాబును స్కూల్‌ నుంచి తీసుకురావాలి... అంటూ ఏవేవో చెబుతుండేవారు. 
 
నేను సినిమా ఒప్పుకున్నాక.. దాని పైనే ధ్యాస. ఇంటికి కూడా వెళ్ళను. మొత్తం కాన్‌సన్‌ట్రేషన్‌ సినిమా పైనే వుండాలనుకుంటాను. అలా అందరూ వుండలేరు. అలా అనుకోవడమూ తప్పే. కానీ నా పాలసీ అది. ఒక్కోసారి ట్యూన్‌ బాగోలేదనీ, పాట బాగోలేదని అనేవాడ్ని. వెంటనే నిర్మాతకు ఫోన్‌ చేసి.. నేను తేజతో చేయనని చెప్పేవాడు. అప్పటికే 6 పాటలు పూర్తయ్యాయి. కొంతసేపయ్యాక.. కాంప్రమైజ్‌.. మళ్ళీ ఆయనకే ఫోన్‌ చేసి.. కాంప్రమైజ్‌ అయ్యాం అనేవాడు... కళ్యాణి మాలిక్‌ సీనియర్‌ టెక్నీషియన్‌.. మంచి టాలెంట్‌డ్. టాలెంట్‌ వున్నవారికి తిక్కకూడా వుంటుంది. 
 
అలాగే నిర్మాతకూ మీకు మధ్య హోరాహోరీ జరిగిందా?
షూటింగ్‌కు ముందు జరిగింది. నేను ఎలా కాంప్రమైజ్‌ కానో.. ఆయన కూడా అంతే. మా ఇద్దరి కలయిక వేరే సందర్భంలో జరిగింది. అప్పుడు మాటల్లో సినిమా ప్రస్తావ వచ్చింది. ఒక కథ చెప్పాను. అది వద్దన్నారు. తర్వాత మరోటి చెప్పాను. ఇది చేద్దామన్నారు... మళ్ళీ.. మొదటిదే చేద్దామని ఫైనల్‌ చేశారు. కథ ఓకే అయ్యాక.. 20 చోట్ల కరెక్షన్లు చేయాలని చెప్పారు. దానికోసం మూడు నెలలు సమయం పట్టింది. నిర్మాతగా ఆయన నాకు బాగా నచ్చారు. తను కాంప్రమైజ్‌ కాకుండా చేయించుకోవడం మంచి పరిణామం. 
 
తేజ సినిమా అంటే కొడతారనే టాక్‌ వుంది?
అవును.. పొద్దునే రాగానే ఆర్టిస్టులందనీ వరుసలో నిలబెట్టి ఫటఫటమని పీకుతాను. ఇప్పుడే టేక్‌ చేద్దామని మూడ్‌కు వచ్చేమంటాను. అలాగే భోజనం చేశాక.. అందరినీ నిలబెట్టి సేమ్‌ రిపీట్‌ చేస్తాను. ఇదంతా వారిని మూడ్‌లోకి తెచ్చేందుకే చేస్తాను. నటీనటుల్లో ఫర్‌ఫెక్షన్‌ కోసమే అలా చేస్తాను. ఒకసారి కొండమీద హీరోహీరోయిన్లపై పాట షూట్‌ చేయాలి. సరిగ్గా చేయడం లేదు. చెప్పిచెప్పి విసుగుపుట్టి.. కిందకు వచ్చి నిర్మాతతో చెప్పేశాను. ఈ పాట చేయడం లేదని.. టెక్నీషియన్లు సామాన్లు తెచ్చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ చేస్తామని అన్నారు. అయితే ఈ సామాన్లన్నీ మీరే మోయండని చెప్పాను. వారే మోసారు.. ఆ పాట చేశాను. బాగా వచ్చింది. 
 
మీ చిత్రాల్లో ఆంజనేయస్వామికి చెందిన గుర్తును వాడతారు. మీరు భక్తులా?
'జయం' సినిమాలో జెండాపై కపిరాజులా స్వామిని వుపయోగించాను. ఈ సినిమాలో కూడా ఓ జెండా వుంటుంది. అది సినిమా చూస్తే తెలుస్తుంది.
 
సినిమా లొకేషన్లు మన దగ్గరే చాలా వుంటే.. వేరే అటవీ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం?
కథ ప్రకారం హీరోయిన్‌కు సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌. దానికనుగుణంగా లొకేషన్‌ చూడాలి. వైజాగ్‌ వెళ్లాలా? అరకు వెళ్లాలా.. ఇవన్నీ చాలా సినిమాల్లో వచ్చేశాయి కదా.. లేపోతే హార్సిలీహిల్స్‌.. ఊటీ.. ఇలా అనుకుంటూ అక్కడ చలిగా వుంటుంది కదా. అనిపించింది. కథ ప్రకారం ఎక్కువ వర్షం వుండాలి. దానికోసం సహజంగా నెట్‌లో వెతికితే చిరపుంజి చూపిస్తుంది.. కానీ నేను కొట్టగానే.. కర్నాటకలో ఓ ప్లేస్‌ చూపించింది. అక్కడ కింగ్‌ కోబ్రాలుంయాని కూడా వుంది. ఒకవేళ అక్కడ వర్షం ఆగిపోతే అందుకు సంబంధించిన మిషన్‌ కూడా తెచ్చుకున్నాం. రోజూ షూటింగ్‌లో పాములు కనబడేవి.  
 
మీకు బాగా నచ్చిన సీన్‌?
ఒకచోట హీరో హీరోయిన్‌కు ఐలవ్‌యు అని చెబుతాడు.. లాగి పెట్టి కొడుతుంది. దాంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటాడు. సహజంగా ధైర్యవంతులు ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇందులో హీరో మొదటి పద్ధతిలో ఆలోచిస్తాడు. కానీ దాన్నుంచి బయటపడతాడు. ఆ సీన్‌ బాగా నచ్చింది.
 
ఈ సినిమాల్లో ఏదోరకంగా మీ గొంతు విన్పిస్తుంది. దీనిలో కూడా వుందా?
'చిత్రం' నుంచి ప్రతి సినిమాలో ఏదో రకంగా నా వాయిస్‌ విన్పిస్తుంది. పాటలైతే పాడలేను కానీ.. డైలాగ్సు మాత్రం వుంటాయి. చిత్రంలో 'గాజువాక పిల్లో.. పాటలో వెయ్యరా దరువు.. అనే మాటలు నేను చెప్పాను. ఈ సినిమాలో కూడా చెప్పాను. 
 
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మీ సినిమాల్లో పవర్‌ఫుల్‌ మహిళను తీసుకుంటారు. ఇందులో ఎవర్ని తీసుకున్నారు?
సీమ అనే ఆర్టిస్టు. ఆమె దాదాపు 300 సినిమాల్లో నటించింది. రంజిత్‌ మూవీస్‌ బేనర్‌లో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం కేరళలో వుంది. ఆవిడైతే బాగుంటుందని నిర్మాత చెప్పడంతో ఆమెను పిలిపించాం. బాగా చేసింది.
 
మీ షూటింగ్‌లో వింత అనుభవాలు?
మేం వెళ్ళే లొకేషన్‌లో ఏమీ దొరకవని తెలుసు. అందుకే అన్నీ ముందే తీసుకెళ్ళాం. పండ్లు, పూలు అక్కడే తీసుకున్నాం. ఒకరోజు షూటింగ్‌లో 15 అడుగుల పాము వచ్చింది. దాన్ని చంపడానికి ట్రై చేశారు. వద్దని వారించాను. జంతువులు, క్రిమికీటకాలు, చెట్లు, చిన్నపిల్లలు వంటివని వాటికి ఎటువంటి హానీ చేయనివ్వను. చేయవద్దని చెబుతాను. ఆ పాము వెళ్ళాక మరలా షూటింగ్‌ చేసేశాం. కానీ ఆ ఫీలింగ్‌ కొందరిలో వుంటుంది. ఇటీవలే మా ఇంటి బాత్‌రూమ్‌లో జెర్రి వచ్చింది. మా ఆవిడ చూసి చంపేస్తానంది.. వద్దన్నాను. అది ఎటో వెళ్ళిపోయింది. ఆ రాత్రి నేను హాయిగా నిద్రపోయాను.. కానీ మా ఆవిడ.. తెల్లవార్లూ మెళకువగా వున్నానంది.. ఎప్పుడు ఎటునుంచి వస్తుందోనని.. 
 
కెమెరామెన్‌ ఎలా చేశాడు?
తను కొత్త. పేరు దీపక్‌ భగవంత్‌. ఎక్కడా లైట్‌ వాడకుండా పగలు వెలుగుతోనే చేశాడు. రెండుమూడు చోట్ల ఇంటిలో చేయాలంటే.. రెండు, మూడు బల్బుల్తో చేశాడు.
 
హీరోను ఎలా సెలెక్ట్‌ చేశారు. ఏం సూచనలు చేశారు?
ఆడిషన్‌ చేస్తుండగా వచ్చాడు. బాగానే వున్నాడని సెలెక్ట్‌ చేశాను. అయితే ఆయన పండ్ల వరుస సక్రమంగా లేకపోవడంతో అపోలోలో సరిచేసుకోమని చెప్పాను. గతంలో నితిన్‌కు కూడా ఓ పన్ను సరిగ్గా వుండేది కాదు. పైకి వచ్చేది. దాన్ని సరి చేయించాను.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments