Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కట్టప్ప' ఎందుకు చంపాడో చెప్తే రాజమౌళి నన్ను వేసేస్తాడు... అభినేత్రి తమన్నా ఇంటర్వ్యూ

దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన 'అభినేత్రి' అనే సినిమాతో కొత్తగా కన్పించబోతోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి, తన కెరీర్‌ గురించ

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (21:50 IST)
దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, తాజాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన 'అభినేత్రి' అనే సినిమాతో కొత్తగా కన్పించబోతోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి, తన కెరీర్‌ గురించి తమన్నా చెప్పిన విశేషాలు.
 
రెండు పాత్రలు, మూడు భాషల్లో నటించడం ఎలా అనిపించింది?
నిజం చెప్పాలంటే, చాలా కష్టంగా ఉండేది. ఇకపై ఇలా మూడు భాషల్లో తెరకెక్కే సినిమాలు చేయొద్దని ఫిక్స్‌ అయిపోయా. ఒకరకంగా నేనే అనవసరంగా చెప్పాను. ముందు హిందీ. తమిళ్‌ అన్నారు. నేనే .. తెలుగులో కూడా మార్కెట్‌ వుందని.. తెలుగు పేరు చెప్పా.. అందుకుగాను.. నాకు పనిష్‌మెంట్‌లా మూడు భాషలు చేయాల్సి వచ్చింది.
 
ప్రభుదేవా మీ డాన్స్‌ గురించి పొగుడుతున్నారు?
ఆయన ముందు నేనెంత.. ప్రభుదేవా పక్కన నటించడం అంటే చాలా ఎగ్జైట్‌ అయ్యా. ఒకసారి పాట షూటింగ్‌ ఉందంటే, డ్యాన్స్‌ ఎలా చేయాలీ అని రాత్రంతా నిద్ర పట్టలేదు. అయితే ప్రభుదేవా మాత్రం సెట్లో చాలా సరదాగా ఉంటారు. స్టార్‌డమ్‌ మొత్తాన్నీ పక్కనపెట్టి సింపుల్‌గా ఉంటారు. ఒక్కసారి కెమెరా స్విచ్చాన్‌ చేస్తే మాత్రం మళ్ళీ ఆయన తన పనిలో సీరియస్‌గా ఇన్వాల్వ్ అయిపోతారు. అలాంటి వ్యక్తి నన్ను పొగడటం.. ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
 
ఇందులో కష్టమైన డాన్స్‌ వుందా?
ఒకపాట కోసం చాలా కష్టపడి డ్యాన్స్‌ చేశా. సినిమాకే హైలైట్‌గా నిలిచే పాట అది. ఇలాంటి సినిమాను వేరే ఇంకెవ్వరూ చేయలేరనే అనుకుంటా.
 
ఇలాంటి రోల్స్‌ చేయాలని ఎందుకనిపించింది?
బాహుబలి వంటి సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను కొత్తగానే చూడాలనుకుంటున్నారు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనపడాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో నన్ను నేను కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఆ సమయంలో 'అభినేత్రి' కథ విన్నాను. కొత్తగా అనిపించడంతో చేయడానికి ఆసక్తి చూపించాను. మూడు భాషల్లో ఒక సినిమాను చేయడమంటే ఎంత కష్టమో తెలిసింది. అంటే సినిమా చేయడం కష్టమని కాదు.. కంటిన్యూగా వర్క్‌ చేయడం వల్ల అందరం బాగా అలసిపోయాం. మూడు భాషల్లో మూడు రకాల లిప్‌ మూమెంట్స్‌తో డైలాగ్స్‌ చెప్పడం, మూడు భాషల లిప్‌ మూమెంట్స్‌కు తగిన విధంగా డ్యాన్స్‌ మూమెంట్స్‌లో చిన్న వేరియేషన్స్‌తో మళ్లీ చేయడం ఇలాంటి చాలా కష్టమయ్యాయి.
 
దెయ్యంలా భయపెడతారా?
పేరుకే హర్రర్‌ పార్ట్‌ ఉంటుంది కానీ, అది రెగ్యులర్‌ హర్రర్‌ సినిమాలా కాకుండా వేరేలా ఉంటుంది. ఎక్కువ బ్లడ్‌ ఉండే హర్రర్‌ సినిమా కాదు. దెయ్యం కన్పించదు.
 
లేడీ ఓరియంటడ్‌ సినిమా ప్రాధాన్యతను ఎలా గుర్తించారు?
లేడీ ఓరియంటడ్‌ సినిమా చేయాల్సిన సమయం వచ్చింది అనిపించాకే అభినేత్రి చేశా. మనకంటూ ఒక గుర్తింపు, మార్కెట్‌ వచ్చాక పర్ఫార్మెన్సుకు స్కోప్‌ ఉన్న లేడీ ఓరియంటడ్‌ సినిమాలు చేయడంలో తప్పులేదు.
 
జాగ్వార్‌లో స్పెషల్‌ సాంగ్‌కు ఎక్కువ తీసుకున్నారని తెలిసింది?
నేను ఎప్పుడూ ఎక్కువగా తీసుకుంటాను. 
 
హీరోయిన్‌గా వుండి ఇలా డాన్స్‌ చేసే పాత్రలు చేయడానికి కారణం?
సౌతిండియన్‌ సినిమా ఆలోచనల్లో ఇంకా మార్పు రాలేదనుకుంటా. సూపర్‌ స్టార్స్‌ సైతం బాలీవుడ్‌లో స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తూంటారు. మనవల్ల ఒక సినిమాకు అదనపు ఆకర్షణ ఉంటుందంటే స్పెషల్‌ సాంగ్‌ చేయడంలో తప్పులేదు. అదేవిధంగా రెమ్యునరేషన్‌ కూడా బాగున్నప్పుడు చేస్తే మంచిదే కదా!
 
బాహుబలి సినిమా ఎలా వస్తోంది?
క్లైమాక్స్‌ షూటింగ్‌లో నావి కొన్ని కీలక సన్నివేశాలుంటే పూర్తి చేశా. నా పాత్రకు సంబంధించిన షూట్‌ ఇంకా కొంత భాగం మిగిలే ఉంది.
 
కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పరా?
నాకూ తెలీదు.. ఏది చెప్పినా.. రాజమౌళి నన్ను వేసేస్తారు.(నవ్వుతూ)
 
మీ వయస్సువారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి మీరు?
వాళ్ళు చేసుకుంటే నేను చేసుకోవాలా? ఇదెక్కడి రూలు.. నాకిప్పుడే పెల్లిష్టంలేదు. ఇంకా నటిగా చాలా చేయాల్సింది వుంది. 
 
కొత్త చిత్రాలు
విశాల్‌తో నటించిన 'ఒక్కడొచ్చాడు' అక్టోబర్‌లోనే విడుదలవుతుంది. తర్వాత బాహుబలి షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఇవి కాకుండా తమిళంలో శింబుతో ఓ సినిమా చేయబోతున్నానని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments