చిరంజీవిని మెప్పిస్తా... పవన్ కళ్యాణ్ సందేశమిస్తే బావుంటుంది.... పూరీ ఇంటర్వ్యూ

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2015 (20:34 IST)
ఇడియిట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి వంటి భిన్నమైన టైటిల్స్‌తో దర్శకుడిగా ముద్రవేసుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌. అయితే జ్యోతిలక్ష్మి అనే పేరుతో చార్మితో సినిమా తీసి మహిళలను ఆకట్టుకున్నాడు. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చుకోకపోయినా.. నిర్మాతగా మంచి లాభాలు వచ్చాయనీ, ఆ సినిమా జర్నీపై ఓ పుస్తకం కూడా రాస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా వరుణ్‌తేజ్‌తో లోఫర్‌ అనే సినిమా తీశాడు. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా పూరీతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
 
ఇడియట్‌, పోకిరి.. మరి ఈ లోఫర్‌ ఎలా వుంటాడు?
లోఫర్‌ మన తెలుగు సినిమా ఫార్మాట్లోనే సాగిపోయే ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. అయితే ఈ సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చా. కుటుంబ విలువలను చూపుతూ నేను చాలాకాలం తర్వాత చేసిన సినిమా లోఫర్‌.
 
ముందుగా వేరే టైటిల్‌ అనుకున్నారుగా?
అవును.. కాన్సెప్ట్‌.. మదర్‌ సెంటిమెంట్‌. అయితే.. చిత్రంలో హీరోకు కరెక్ట్‌గా సరిపోతుందని పెట్టాం. హీరో పాత్ర కథ రీత్యా అల్లరిచిల్లరగా, ఒక గమ్యం లేకుండా మొదలవుతుందని అలా పెట్టా. మొదట్లో అనుకున్న పేరుకి, ఈ పేరుకి చాలా తేడాలున్నా సినిమాకు ఈ కొత్త టైటిల్‌ కూడా సరైన జస్టిఫికేషన్‌ ఇచ్చేలా ఉంటుంది.
 
వరుణ్‌ తేజ్‌ గురించి?
వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా అతడి కొన్ని క్లిప్స్‌ చూసి చిరంజీవి గారు వరుణ్‌కి మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పారు. ఒక్కసారి తన పాత్రలోకి వెళ్ళిపోయాక అన్నీ మర్చిపోయి వరుణ్‌ చాలా తెలివిగా నటించేస్తాడు.
 
తల్లిగా రేవతిని చేయనన్నా ఒప్పించారటగా?
మొదట్లో రేవతి గారు ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే కథ విన్నాక ఆమె వెంటనే ఒప్పుకున్నారు. నేను ఈ కథ రాసుకున్నపుడే రేవతి గారిని ఆ పాత్రలో ఊహించా. కథరీత్యా ఈ పాత్ర కొంత నెగటివ్‌ షేడ్స్‌తో ప్రవర్తిస్తూ ఉంటుంది. రేవతి గారి పాత్ర, పోసాని గారు చేసిన పాత్రతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకనే ఆ కోణంలో పోసాని గారైతేనే బాగుంటుందని ఆయన్ను ఎంపిక చేశా. పోసాని గారు అద్భుతంగా నటించారు.
 
'జ్యోతిలక్ష్మి' కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదని తెలిసింది?
'జ్యోతిలక్ష్మి' సినిమా విషయంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఆ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టి హిట్‌గా నిలిచింది. చెప్పాలంటే ఆ సినిమా వల్ల మహిళల నుంచి నాకు కాస్త గౌరవం కూడా దక్కింది. జ్యోతిలక్ష్మి సినిమా గురించి, ఆ ప్రయాణం గురించి త్వరలో ఓ పుస్తకం కూడా రానుంది.
 
చిరు 150వ సినిమా కోసం పోటీపడుతున్న దర్శకుల్లో మీరింకా ఉన్నారా?
చూడండీ.. 150వ సినిమా కాకపోతే ఆ తర్వాతి సినిమా అయినా ఆయనతో చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎన్నైనా కొత్త కథలు చెప్పి ఆయన్ను మెప్పించే ప్రయత్నం చేస్తా. చిరంజీవి లాంటి హీరోను డైరెక్ట్‌ చేయడానికి ఎవరిష్టపడరు చెప్పండీ?
 
చిరుపై మీ కామెంట్స్‌ గురించి మెగా ఫ్యాన్స్‌ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ను ఎలా తీసుకుంటారు?
చిరంజీవి గారికి, నాకు మధ్య ఎంత మంచి రిలేషన్‌ ఉందో మాకు తెలుసు. ఇక ఫ్యాన్స్‌ కామెంట్స్‌ అంటారా.. వాటిని నేను స్పోర్టివ్‌గానే తీసుకుంటా.
 
స్టార్‌ హీరోల అభిమానులు ఈమధ్య కాలంలో గీత దాటుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా? లోఫర్‌ ఆడియో లాంచ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ చర్య గురించి ఏమంటారు?
చెప్పాలంటే ఫ్యాన్స్‌ చర్యలతో నేను కూడా అసహనానికి గురయ్యా. ముఖ్యంగా వేరే ఇతర హీరో ఫంక్షన్‌లో అలా చేయడం పద్ధతి అనిపించుకోదు. పవన్‌ కళ్యాణ్‌ గారు కూడా ఈ విషయం గురించి ఆలోచించి తన ఫ్యాన్స్‌కు ఓ సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments