ప్రస్తుతం వున్న తరుణంలో హీరోయిన్లకు కాలం పరిమితం. మేగ్జిమం రెండేళ్లు. నేను చేసిన `మెంటల్ మదిలో` సినిమా 2016లో విడుదలైంది. నాలుగేళ్ళుగా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాను. అందుకోసం సెకండ్‌హీరోయిన్ అనేది ఆలోచించకుండా కథను బట్టి సినిమాలు చేస్తున్నానని... నివేదా పేతురాజ్ చెబుతోంది. రామ్ నటించిన `రెడ్`లో ఆమె పోలీసు ఆఫీసర్‌గా నటించింది. తిరుమల కిశోర్ దర్శకుడు. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. సంక్రాంతికి విడుదలకానుంది. ప్రమోషన్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ ఇంటర్వూ విశేషాలు.
* తమిళ తడమ్ రీమేక్ కదా. ఆ సినిమా చూశారా?
నేను ఆ సినిమా చూడలేదు. కానీ ఒక్క సీన్ చూశా. కొరియోగ్రఫీ కోసం చూశాను అంతే.
* పోలీసు ఆఫీసర్‌గా నటించేటప్పుడు ఎవరిని బేస్ చేసుకున్నారు?
దర్శకుడు కిశోర్ చెప్పినట్లు చేశాను. ఆయనే పాత్ర సృష్టికర్త. సింగిల్ టేక్‌లో క్లారిటీ ఇచ్చేశారు. పోలీసుగా ఎవరినీ స్పూర్తిగా తీసుకోలేదు. ఇంతకుముందు తమిళంలో ఓ పోలీసు పాత్ర చేశాను. తెలుగులో కూడా చిత్రలహరిలో కూడా చేశాను.
* చిత్రలహరికి రెడ్‌కు ఎటువంటి తేడా వుంటుంది?
చిత్రలహరిలో చాలా మూడీ పాత్ర. రెడ్‌లో లుక్ చాలా ధైర్యంగా వున్నట్లుంటుంది. కానీ లోపల చాలా అమాయకత్వంగా కన్పించే పాత్ర. పెద్దగా ధైర్యం వుండదు. లోపల భయం వుంటుంది.
* మీరు కథలు పూర్తిగా వుంటారా?
బ్రోచేవారు ఎవరురా.. సినిమా టైంలో వివేక్ ఆత్రేయ.. చెప్పిన కథంతా పూర్తిగా వినలేదు. కేవలం 10 నిముషాలే విన్నాను. ఇక చాలు. సెకండాఫ్ చెప్పవద్దు అన్నా. అంటే వివేక్‌పై వున్న నమ్మకం ఇక్కడ కిశోర్ పైగా వుంది. వారు పాత్రను మలిచిన తీరు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది.
* రామ్‌తో నటించేటప్పుడు ఏమీ గ్రహించారు?
రామ్‌లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ వుంది. నైస్ పర్సన్. పక్కా తమిళ్‌లో మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా. అల వైకుంఠపురంలోనే కొంచెం నేర్చుకున్నా.
* సెకండ్ హీరోయిన్‌గా ఎందుకు చేస్తున్నారు?
అల వైకుంఠపురంలో కథలో భాగంగా పాత్ర వుంది. పైగా త్రివిక్రమ్‌తో సినిమా చేయలేదు. అది ప్రతి ఒక్కరికీ చేరింది. అలా వున్న పాత్ర వస్తే సెకండా ఫస్టా అని ఆలోచించను. ఎందుకంటే.. ఇక్కడ హీరోయిన్లకు లైఫ్ చాలా తక్కువ. మేబీ.. రెండేళ్ళు వుంటాయనుకుంటా.
* రెడ్‌లో యాక్షన్ చేశారా?
నాకు ఇందులో యాక్షన్ సీన్స్ లేవు. రామ్ చేస్తుండగా సెట్‌లో చూశాను. ఇందులో లేవుకానీ.. విరాఠపర్వంలో ఫైట్‌మాస్టర్ పీటర్ హేన్స్‌తో కలిసి యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నా.
* కొత్త సినిమాలు?
పాగల్ అనే సినిమా పూర్తి భిన్నంగా వుంటుంది. విరాఠపర్వంలో స్పెషల్ ఎపీరియన్స్, చందు మొండేటి సినిమా చేస్తున్నా. కార్తికేయ2 కథ చెప్పారు. ఇంకా ఫైనల్ చేయలేదు.
ఇక్కడే నాకంటూ మార్కుచూపించుకోవాలి. అక్కడకు వెళ్ళే ఆలోచన లేదు.
* సినిమా చేస్తున్నప్పుడే ఇది హిట్టా కాదా అని తెలిసిపోతుందా?
అవును. షూట్‌లో వుండగా ఐదు రోజులకే తెలిసిపోతుంది. ఓసారి మహేష్‌బాబు ఇంటర్వ్యూలో విన్నాను. కనీసం 5,10 రోజ్లులో మనం షూటింగ్‌లో వుండగా ఆ సినిమా ఎలా వుంటుంది అని తెలిసిపోతుందని. హిట్టా, ఏవరేజ్, బిలో ఏవరేజా తెలిసిపోతుంది. రెడ్ సినిమాకు 5 రోజుల్లోనే బ్లాక్ బస్టర్ అనిపించింది.
* మీ డ్రీమ్ రోల్స్ ఏవైనా వున్నాయా?
నాకు విజయ్‌సేతుపతి లా పాత్రలు చేయాలనుంది. ఎందుకని లేడీస్ అలా చేయకూడదు? అనిపించింది. విజయ్‌సేతుపతి హీరోయిన్‌కు తండ్రిగా, విలన్‌గా, హీరోగా, హీరోయిన్‌గా (సూపర్ డీలక్స్)లో ఇలా అన్ని పాత్రలు చేస్తారు. అందుకే ఐ వాట్ టు బి. ఫిమేల్ విజయ్‌సేతుపతి. అంటూ ముగించారు.